Daily Horoscope
✕

అతిథి హీరోయిన్ అమృతరావు రెండో పెళ్లి చేసుకుంది.. ఎవరినో తెలుసా?

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (13:56 IST)
Amrita Rao
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అతిథిలో నటించిన హీరోయిన్ అమృతరావు రెండో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అమృతరావు రెండో పెళ్లి చేసుకున్నది ఎవరినే కాదు.. మొదటి భర్తనే మరోసారి పెళ్లి చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అమృతరావు, అన్మోల్‌ ఏడేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2014లో రహస్య వివాహం చేసుకున్నారు. వీరికి 2020లో ఓ బాబు పుట్టాడు. 'కపుల్ ఆఫ్ థింగ్స్​' పేరుతో వీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేసి అనేక విశేషాలు పంచుకుంటుంటారు. 
 
ఈ ఛానెల్​లోనే ఇటీవల వీరు రెండోసారి పెళ్లి చేసుకున్న వీడియోను పోస్ట్​ చేశారు. కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయవాడ కృష్ణలంకలో దారుణం: యువకుడితో కలిసి లాడ్జికి వచ్చిన వివాహిత దారుణ హత్య

హైదరాబాద్ నుంచి వీసీ సజ్జనార్‌ను ఎందుకు బదిలీ చేశారు?

ప్రియుడికి బ్రేకప్.. స్నేహితులతో కలిసి ఖతం చేసేందుకు ప్లాన్.. నవ్వుతూ ఫోజులు (video)

నిన్నటి వరకు బిలియనీరు.... ఇపుడు పరువు కోల్పోయి దారుణ స్థితికి దిగజారిపోయారు...

నవ్యాంధ్ర అభివృద్ధిలో పోర్టులే కీలక పాత్ర : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బ్రౌన్ రైస్ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

చెన్నై రేలా ఆస్పత్రిలో అన్నవాహికకు అరుదైన చికిత్స - తమిళనాడులోనే తొలిసారి

ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో మేలు

కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?

రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments