Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్ కళ్లు చూసి ఫ్లాటైపోయిన డైరెక్టర్... తక్షణం బుక్ చేసిన హీరో!

అనుపమ పరమేశ్వరన్. కేరళ నుంచి దిగుమతి అయిన హీరోయిన్. తన అందచందాలతో చిత్ర పరిశ్రమను ఇట్టే ఆకర్షించింది. ప్రతి ఒక్కరినీ మంత్రముగ్దులను చేస్తోంది. తాజాగా ఈమె కళ్లు చూసి ఓ డైరక్టర్ ఫాటైపోయాడట. ఆ మరుక్షణమే

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2016 (16:41 IST)
అనుపమ పరమేశ్వరన్. కేరళ నుంచి దిగుమతి అయిన హీరోయిన్. తన అందచందాలతో చిత్ర పరిశ్రమను ఇట్టే ఆకర్షించింది. ప్రతి ఒక్కరినీ మంత్రముగ్దులను చేస్తోంది. తాజాగా ఈమె కళ్లు చూసి ఓ డైరక్టర్ ఫాటైపోయాడట. ఆ మరుక్షణమే ఈ కేరళ కుట్టినీ ఆ హీరో బుక్ చేసేశాడట. ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరో కాదు.. సుకుమార్. హీరో రామ్ చరణ్. 
 
చెర్రీ - సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్ ఎవరనే అంశంపై మొన్నటివరకు చాలా చర్చ సాగింది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా మరోసారి రకుల్ ప్రీత్ సింగ్‌ను తీసుకుంటారని అంతా అనుకున్నారు. 
 
మరోవైపు రాశిఖన్నా పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. ఆ అవకాశాన్ని అనుపమ పరమేశ్వరన్ ఎగరేసుకుపోయిందని టాక్. ఇప్పటికే "అ.. ఆ..." సినిమాతో పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం 'శతమానంభవతి' అనే సినిమాలో శర్వానంద్ సరసన నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఇది విడుదలకానుంది.
 
ఈ పరిస్థితుల్లో పల్లెటూరి అమ్మాయి లుక్స్ కావాలంటున్న సుకుమార్… అనుపమ కళ్లుచూసి ఫ్లాట్ అయిపోయాడట. వెంటనే తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడట. ఏ క్యారెక్టర్‌కైనా ఇట్టే సెట్ అయిపోయే ఈ మలయాళ బ్యూటీ.. సుకుమార్ చెప్పిన స్టోరీలైన్‌కు ఫిదా అయిపోయింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇలా సుకుమార్-అనుపమ మధ్య ఓ అండర్ స్టాండింగ్ వచ్చేసింది. అయితే ఈ ఎంట్రీకి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments