Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు కేరళ కుట్టికి ఛాన్స్ దక్కించుకుంది

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (14:03 IST)
ప్రేమమ్, శతమానంభవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు.. తదితర చిత్రాల్లో నటించిన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్ముడు టాలీవుడ్లో కెరీర్ ప్రారంభంలో బాగా అవకాశాలు అందిపుచ్చుకుంది కానీ... ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడం వలన కెరీర్లో వెనకబడింది.
 
ఆమె నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఇక ఈ అమ్మడుని అంతా మరచిపోయారు. ఇలాంటి టైమ్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమాలో నటించింది.
 
 ఈ సినిమా సక్సస్ సాధించడంతో మళ్లీ కెరీర్ పైన ఆశలు మొదలయ్యాయి ఈ కేరళ కుట్టికి. తాజాగా మరో సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
 
ఇంతకీ.. ఏ సినిమాలో అంటే.. నిఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పైన రాబోతున్న 18-పేజెస్ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతోంది అనుపమ. నిజానికి ఈ సినిమాలో ముందుగా అనుపమ పేరే తెర పైకి వచ్చింది. కానీ అంతలోనే ఆమె కాదని, ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది.
 
ఈ క్రమంలో అను ఎమ్మాన్యుయేల్, షాలినీ పాండేతో పాటు ఉప్పెన ఫేం కృతి షెట్టి పేరు కూడా వినిపించింది. అలా చుట్టూ తిరిగి ఆఖరికి అనుపమ పరమేశ్వరన్‌నే వరించింది 18-పేజెస్ ఆఫర్. ఈ సినిమా సక్సస్ అయితే.. మరిన్ని అవకాశాలు వస్తాయి. మరి.. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో... అమ్మడు కెరీర్‌ని ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments