Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి 3' ఉంటుందా? ఉండదా? నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్లో ఏమన్నారు?

'బాహుబలి పార్ట్ 3' ఉంటుందా? ఉండదా? ఇదే దేశవ్యాప్తంగా సాగుతున్న ఆసక్తికర చర్చ. ఈ విషయంపై బాహుబలి చిత్ర దర్శకుడు, కథా రచయిత నుంచి స్పష్టమైన క్లారిటీ లేదు. కానీ, ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ

Webdunia
మంగళవారం, 23 మే 2017 (15:27 IST)
'బాహుబలి పార్ట్ 3' ఉంటుందా? ఉండదా? ఇదే దేశవ్యాప్తంగా సాగుతున్న ఆసక్తికర చర్చ. ఈ విషయంపై బాహుబలి చిత్ర దర్శకుడు, కథా రచయిత నుంచి స్పష్టమైన క్లారిటీ లేదు. కానీ, ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మాత్రం అపుడపుడూ 'బాహుబలి 3'పై ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ 'బాహుబలి 3' ఉంటుందనే విషయం డొంకతిరుగుడుగా అర్థమైంది. 
 
శోభు యార్లగడ్డ తాజాగా చేసిన ట్వీట్‌లో 'ఒకసారి జరిగింది రెండోసారి జరగదు. కానీ రెండు సార్లు జరిగింది ఖచ్చితంగా మూడవసారి జరుగుతుంది' అంటూ ట్వీట్ చేశారు. అంటే ఆయన బాహుబలి సక్సెస్‌ గురించే ట్వీట్ చేశారంటూ పేర్కొన్నారు. పైగా, ఆయన చేసిన తాజా ట్వీట్ 3వ పార్టుకు సంకేతమంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ రాజమౌళి ఆలోచన ఎలా ఉందో చూడాలి.
 
కాగా, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి-ది బిగినింగ్' 2015లో విడుదలైన భారీ విజయాన్ని సాధించగా దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'బాహుబలి- ది కంక్లూజన్' చిత్రం ఈ 2017లో విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సీక్వెల్ నమోదు చేసిన రికార్డులతో దేశవ్యాప్తంగా తెలుగు సినిమా స్టామినా ఏమిటో స్పష్టంగా తెలిసొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌ను నడిపింది ఇద్దరు మహిళలే.. తాట తీస్తాం? (video)

భారత్ పాక్ సైనిక సంఘర్షణ ప్రపంచం భరించలేదు : ఐక్యరాజ్య సమితి

ఆపరేషన్ సింధూర్: దేశ వ్యాప్తంగా రాజకీయ నేతల హర్షం.. రాహుల్ ప్రశంసలు

భారత నుంచి చుక్కనీరు పోనివ్వం... అన్నీ మేమే వాడుకుంటాం : ప్రధాని మోడీ

1971 యుద్ధం తర్వాత కలిసికట్టుగా త్రివిధ దళాల దాడులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments