రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

ఠాగూర్
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (18:10 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'జైలర్-2'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఇదే వార్త ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం నందమూరి బాలకృష్ణను చిత్రం బృందం సంప్రదించగా, యువరత్న బాలకృష్ణ సైతం సమ్మతించినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే, ఈ వార్తలపై మేకర్స్ నుంచి స్పందన లేదు. 
 
గతంలో వచ్చిన 'జైలర్' చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. దీంతో రజనీ - నెల్సన్‌లు రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగంలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్‍ వంటి వారు సినిమాను మలుపు తిప్పే అతిథి పాత్రలో మెరిశారు. ఇపుడు అలాంటి పాత్రనే బాలకృష్ణ పోషించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. నిజానికి ఈ చిత్రం తొలి భాగంలోనే బాలకృష్ణను తీసుకోవాలని ప్రయత్నించినట్టు దర్శకుడు నెల్సల్ ఓ సందర్బంలో చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan : నాలుగు రోజులు వైరల్ ఫీవర్- హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్

NTR Statue: అమరావతిలో 100 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం

అసెంబ్లీలో నందమూరి బాలయ్య మాటలు.. చిరంజీవి....

UP: రీల్స్ తీస్తుండగా రైలు ఢీకొని యువకుడు మృతి

ఆ వ్యక్తి కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు, రెండు పెన్నులు.. ఎలా వెళ్లాలి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments