బోయ‌పాటి... బాల‌య్య క్యాంప్ నుంచి చిరు క్యాంప్‌లోకి వ‌చ్చారా..?

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (22:24 IST)
ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను విన‌య విధేయ రామ సినిమా త‌ర్వాత నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య‌తో సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. బాల‌య్య‌తో చేయాల‌నుకున్న సినిమా బ‌డ్జెట్ ఎక్కువ కార‌ణంగా ఆగింద‌ని.. ఖ‌చ్చితంగా బాల‌య్య‌తో బోయ‌పాటి సినిమా ఉంటుంద‌ని ప్రచారం జ‌రిగింది. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు త‌ర్వాత బాల‌య్య కె.ఎస్.ర‌వికుమార్‌తో సినిమా ఎనౌన్స్ చేయ‌డంతో.. అస‌లు బాల‌య్య - బోయ‌పాటి సినిమా ఉంటుందా..? ఉండ‌దా..? అనే అనుమానాలు ఏర్ప‌డ్డాయి.
 
దీంతో బోయ‌పాటి నెక్ట్స్ మూవీ ఎవ‌రితో ఉంటుంది..? ఎప్పుడు ఉంటుంది..? అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. గుణ 369 ట్రైల‌ర్ రిలీజ్‌కి మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్, బోయ‌పాటి శ్రీను ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో అల్లు అర‌వింద్ మాట్లాడుతూ... బోయ‌పాటితో గీతా ఆర్ట్స్‌లో సినిమా ఉంటుంద‌ని ఎనౌన్స్ చేసారు. సరైనోడు త‌ర్వాతే గీతా ఆర్ట్స్‌లో బోయ‌పాటి డైరెక్ష‌న్లో చిరంజీవి సినిమా అని ఎనౌన్స్ చేసారు.
 
ప్ర‌స్తుతం మెగాస్టార్ సైరా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత బ్లాక్‌బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నారు. అందుచేత ఇప్ప‌ట్లో చిరు డేట్స్ సెట్ కాక‌పోవ‌చ్చు. మ‌రి అలాంట‌ప్పుడు గీతా ఆర్ట్స్‌లో బోయ‌పాటి చేసే సినిమా ఎవ‌రితో ఉంటుంది అనేది ఆస‌క్తిగా మారింది. త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెనిజులాలో భూకంపం.. 2,595కి పెరిగిన మృతుల సంఖ్య - నిరాశ్రయులైన 16,000 మంది

వారం రోజుల తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు...

కేతన్ హత్య కేసు : శియ గోయల్‌కు ఎంత పొగరో... మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించి హేళన (Video)

టెహ్రాన్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భౌతికకాయం తరలింపు

11 యేళ్ల బాలుడి నిర్లక్ష్యం - 8 మంది సన్యాసులు దుర్మరణం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?

క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?

వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?

రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు

పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments