Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీతో చిందులేసేందుకు సిద్ధమైన కేథరిన్.. బోయపాటి ఛాన్సిచ్చాడట?

హీరోయిన్‌గానే కాకుండా ఐటమ్ గర్ల్‌గా మంచి పేరు కొట్టేసిన కేథరిన్.. తాజాగా రంగస్థలం హీరో రామ్ చరణ్‌తో చిందేసేందుకు సిద్ధమవుతోంది. రంగస్థలంలో జిగేల్ రాణి పూజాహెగ్డేతో స్టెప్పులేసిన చెర్రీ.. కేథరిన్‌తో ఐట

Webdunia
గురువారం, 10 మే 2018 (12:49 IST)
హీరోయిన్‌గానే కాకుండా ఐటమ్ గర్ల్‌గా మంచి పేరు కొట్టేసిన కేథరిన్.. తాజాగా రంగస్థలం హీరో రామ్ చరణ్‌తో చిందేసేందుకు సిద్ధమవుతోంది. రంగస్థలంలో జిగేల్ రాణి పూజాహెగ్డేతో స్టెప్పులేసిన చెర్రీ.. కేథరిన్‌తో ఐటమ్ సాంగ్‌కు సై అంటున్నాడు. ఇప్పటికే మరో మెగా హీరో అల్లు అర్జున్ 'సరైనోడు' సినిమాలో ఎమ్మెల్యేగా కనిపించి కేథరిన్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమా తర్వాత బోయపాటి 'జయ జానకి నాయక'లోను అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో కేథరిన్ చేసిన ఐటమ్ సాంగ్‌కి మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చెర్రీతో బోయపాటి చేసే సినిమాలోనూ కేథరిన్‌కు ఛాన్స్ వచ్చింది. కైరా అద్వాని కథానాయికగా చేస్తోన్న ఈ సినిమాలో, చరణ్‌తో కలిసి కేథరిన్ ఒక ఐటమ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
 
బ్యాంకాక్ షెడ్యూల్ తరువాత ఈ ఐటమ్ సాంగ్‌ను చిత్రీకరిస్తారట. గతంలో చిరంజీవి ''ఖైదీ నెంబర్ 150'' షూటింగు సమయంలో కొన్ని కారణాల వలన కేథరిన్ తప్పుకుంది. దీంతో మెగా హీరోల సరసన కేథరిన్‌కు ఛాన్స్ దొరకదేమోనని అందరూ అనుకున్నారు. కానీ చిరు కుమారుడు చెర్రీ సరసన చిందేసే ఛాన్సును కేథరిన్ కొట్టేయడంతో అందరూ నోరెళ్లబెట్టారు.
 
ఇందుకోసం.. అందాల కేథరిన్ ప్రస్తుతం కొత్త తరహా డ్యాన్స్ నేర్చుకుంటోంది. ఇటీవల హాలిడే కోసం అమెరికా వెళ్లిన ఈ చిన్నది, పాప్యులర్ డ్యాన్సర్ మిస్ వీ వద్ద రెండు వారాల క్రాష్ కోర్సు కోసం జాయిన్ అయింది. పాపింగ్ అండ్ లాకింగ్ స్టయిల్ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments