Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ నెలలో బొమ్మ పడటం డౌటేనా?

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (17:04 IST)
కరోనా వైరస్ దెబ్బకు అన్ని సెక్టార్లు మూతపడితున్నాయి. అత్యవసర విభాగాలు మినహా ఏ ఒక్కటీ పని చేయడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇక ఐటీ ఉద్యోగుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై ప్రభావం చూపినట్టుగానే సినీ ఇండస్ట్రీపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే సినిమా షూటింగ్‌లు నిలిపివేశారు. అలాగే, థియేటర్లు కూడా మూసివేశారు. దీంతో మార్చి మూడు, నాలుగు వారాల్లో విడుదల కావాల్సిన అనేక చిత్రాలు ఏప్రిల్ నెలకు వాయిదాపడ్డాయి. 
 
అయితే, ఏప్రిల్ నెలలో కూడా థియేటర్లు తెరుచుకోవడం అనుమానమేనని సినీరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ అర్థరాత్రి వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. అంటే.. అప్పటివరకు అత్యవసర సేవలు మినహా ఏ ఒక్కటీ అందుబాటులో ఉండుదు. ఇక థియేటర్లు కూడా అప్పటివరకు మూసివేయాల్సిందే. ఈ కారణంగా సినీ ఇండస్ట్రీ వందల కోట్ల రూపాయల మేరకు నష్టపోయింది.
 
నిజానికి కరోనా వైరస్ కారణంగా మార్చి నెల‌లో విడుద‌ల కావాల్సిన నాని 'వీ', రాజ్‌త‌రుణ్ 'ఓరేయ్ బుజ్జిగా'తో పాటు ప‌లు సినిమాలు వాయిదా ప‌డ్డాయి. మార్చి 31 త‌ర్వాత  క‌రోనా త‌గ్గుముఖం ప‌డితే థియేట‌ర్లు ప్రారంభ‌మ‌వుతాయ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు న‌మ్మ‌కంగా  ఎదురుచూశారు. 
 
తాజాగా దేశ‌మొత్తం లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో వారి ఆశ‌లు ఆవిర‌య్యాయి. ఏప్రిల్ నెల‌లోని  సినిమాలు వాయిదా వేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొన్న‌ట్లు తెలిసింది. ఏప్రిల్‌లో విడుద‌ల‌కావాల్సిన 'ఉప్పెన'‌, 'రెడ్'‌, 'అల్లుడు అదుర్స్', 'శ్రీ‌కారం' చిత్రాల విడుదల తేదీలు మార‌డం ఖాయ‌మైన‌ట్లేన‌ని అంటున్నారు. 
 
ఒక‌వేళ థియేట‌ర్లు ప్రారంభ‌మైన క‌రోనా భ‌యంతో నిండ‌టం క‌ష్ట‌మే నిర్మాత‌లు విడుద‌ల చేయ‌డానికి సాహ‌సించ‌క‌పోవ‌చ్చ‌ని స‌మాచారం. దాంతో ఏప్రిల్‌లో సినిమా బొమ్మ ప‌డ‌టం డౌట్ అనే అంటున్నారు. కొత్త‌సినిమా చూడాలంటే మే నెల వ‌ర‌కు ఆగాల్సిందేన‌ని వారు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments