Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైరెక్టర్ మణిరత్నంకు ఇండియన్ ఆర్మీ వార్నింగ్...?

బొంబాయి.. వంటి చిత్రాన్ని తీసి.. హాట్‌టాపిక్‌గా అప్పట్లో మార్చిన మణిరత్నం.. తాజాగా మరో ప్రయోగం చేయబోతున్నాడు. ఈసారి.. ఏకంగా జమ్ము కాశ్మీర్‌ బోర్డర్‌లో షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే అక్కడ సైనిక స్థావరాలపై పాకిస్తాన్‌ ముష్కరులు దాడులు చేయడం

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (16:59 IST)
బొంబాయి.. వంటి చిత్రాన్ని తీసి.. హాట్‌టాపిక్‌గా అప్పట్లో మార్చిన మణిరత్నం.. తాజాగా మరో ప్రయోగం చేయబోతున్నాడు. ఈసారి.. ఏకంగా జమ్ము కాశ్మీర్‌ బోర్డర్‌లో షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే అక్కడ సైనిక స్థావరాలపై పాకిస్తాన్‌ ముష్కరులు దాడులు చేయడం.. వంటి సంఘటనలు జరగడం, ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య సరైన సయోధ్య లేకపోవడం వంటి సంఘటనలు జరుగుతున్నా... మణిరత్నం సాహసం చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 
 
తమిళ సినిమా 'కాట్రు వెళదిలై'ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కార్తీ, అదితిరావు హైదరి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ రొమాంటిక్‌ డ్రామా ఇప్పటికే చెన్నై, ఊటీల్లో రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది. ఫైనల్‌ షెడ్యూల్‌ జమ్ము కాశ్మీర్‌లోని లడఖ్‌లో జరుగనున్న ఓ భారీ షెడ్యూల్‌ కోసం మణి సిద్ధమవుతున్నారు. లడఖ్‌లో పలు యాక్షన్‌ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 
 
అయితే వారు వేసుకున్న షెడ్యూల్‌ కాస్త మారే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఎటువంటి షూటింగ్‌లు అక్కడ జరగనీయడం మంచిది కాదని అధికారులు తెలియజేస్తున్నారట. ప్రస్తుతం యూరి ఉగ్రదాడి నేపధ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అలముకుని ఉంది. ఈ నేపధ్యంలో అక్కడ షూటింగ్ మంచిది కాదని ఆర్మీ అధికారులు మణిరత్నంను హెచ్చరించి, ప్రస్తుతానికి షూటింగ్ వాయిదా వేసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో అనుకున్న ప్రకారం షెడ్యూల్‌ జరగకపోవచ్చని చిత్ర యూనిట్‌ చెబుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments