Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న భూమిక... అక్క, వదిన పాత్రలకు సై అంటున్న యోగా మాస్టర్ భార్య

సినీ నటి భూమికను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయట. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆమె చేయని ప్రయత్నమంటూ లేదట. ఇందుకోసం అక్కా, వదిన వంటి పాత్రల్లోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తన సన్నిహితుల వద్ద చెపుత

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (16:43 IST)
సినీ నటి భూమికను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయట. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆమె చేయని ప్రయత్నమంటూ లేదట. ఇందుకోసం అక్కా, వదిన వంటి పాత్రల్లోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తన సన్నిహితుల వద్ద చెపుతోందట. 
 
హీరో విజయ్‌కు జంటగా 'భద్రి' చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన భూమిక.. టాలీవుడ్‌కు మాత్రం 2000లో వచ్చిన 'యువకుడు' అనే చిత్రం ద్వారా పరిచయమైంది. ఆమె తెలుగులో నటించిన 'ఖుషీ', 'సింహాద్రి' వంటి మంచి విజయవంతమయ్యాయి. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించింది. పైగా, నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే యోగా మాస్టర్‌ భరత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 
 
బిడ్డకు తల్లి అయిన భూమిక తన భర్తను నిర్మాతగా నిలబెట్టే ప్రయత్నం చేసి చేతులు కాల్చుకుంది. ఈ విషయంలోనే భర్త భరత్‌తో మనస్పర్థలు తలెత్తాయనే ప్రచారం ఆ మధ్య జోరుగా సాగింది. విషయం విడాకుల వరకూ వచ్చినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం హల్‌చల్‌ చేసింది. అయితే తన వ్యక్తిగత విషయాల గురించి నటి భూమిక ఎక్కడా బయట పెట్టలేదు.
 
కానీ, ఇటీవలి కాలంలో ఆమె తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నట్టు సమాచారం. వీటి నుంచి గట్టెక్కేందుకు ఆమె చిన్న పాత్రల్లో సైతం నటించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. అయినప్పటికీ.. ఆమెకు అవకాశాలు రావడం లేదు. ఇకలాభం లేదని భావించిన ఆమె... అక్క, వదిన లాంటి పాత్రల్లో నటించడానికి రెడీ అంటూ తన సన్నిహితులతో చెబుతున్నారట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments