Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు మూవీలో జెనీలియా నటిస్తుందా? ఈ వార్త నిజమేనా?

Webdunia
గురువారం, 21 మే 2020 (23:24 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నతాజా చిత్రం ఆచార్య. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
కరోనా వలన షూటింగ్‌కి బ్రేక్ పడడంతో ఆచార్య రావడం ఆలస్యం అవుతుంది. లేదంటే... ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రావాలి. తాజా సమాచారం ప్రకారం.... ఆచార్య సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడని టాక్ వినిపిస్తోంది. 
 
ఇదిలా ఉంటే... చిరు మూవీలో జెనీలియా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమాలో అంటే... లూసీఫర్ రీమేక్‌లో అని తెలిసింది. ఆచార్య సినిమా తర్వాత చిరంజీవి లూసీఫర్ రీమేక్‌లో నటించనున్నారు.
 
ఈ చిత్రానికి సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వార్త నిజమేనా కాదా అనేది ఆసక్తిగా మారింది. పెళ్లైన తర్వాత జెనీలియా సినిమాలకు దూరంగా ఉంది.
 
అలాంటిది చిరు మూవీలో జెనీలియా నటిస్తుంది అంటూ టాక్ రావడంతో హాట్ టాపిక్ అయ్యింది. మరి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న చిరంజీవి ప్రచారంలో ఉన్న ఈ వార్తపై స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments