Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ జెనీలియా రిపీట్.. బొమ్మరిల్లు బ్యూటీ రీ ఎంట్రీ!

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (15:17 IST)
'రెడీ' సినిమాలో రామ్ జెనీలియా జోడీ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. రామ్ జెనీలియా అంటే టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వుంది. వీరిద్దరూ కలిసి చేసిన రెడీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రియేటివ్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 2008లో వచ్చిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. 
 
అలాంటి ఈ క్రేజీ జోడీ మరోసారి తెరపై కనిపించనున్నట్టు సమాచారం. అయితే ఈ సారి ఆమె రామ్ సరసన హీరోయిన్‌గా కాకుండా ఓ ఇంపార్టెంట్ రోల్ చేయబోతుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయమే సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 
 
చాలాకాలం తరువాత జెనీలియా రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలు తెస్తోంది. తెలుగులో ఈ అమ్మడుకు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో పెద్ద హీరోలతో చేసింది. ఇప్పటికీ ఆ క్రేజ్ అలాగే ఉంది. ఇక పెళ్లి అయిన తర్వాత ఈ ముద్దుగుమ్మ కాస్త విరామం తీసుకుంది. 
 
దగ్గుబాటి రానాతో చేసిన 'నా ఇష్టం' సినిమానే ఈ పిల్లకు తెలుగులో చివరి సినిమా. ఆ తరువాత ఆమె టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయలేదు. మళ్లీ తొమ్మిదేళ్ల తరువాత ఆమె పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రామ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. జెనీలియాను ఏ సినిమా కోసం సంప్రదించారనేదే పూర్తిగా తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments