Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆదిపురుష్" బడ్జెట్‌పై హీరో ప్రభాస్ ప్రత్యేక జాగ్రత్తలు!

Webdunia
బుధవారం, 12 మే 2021 (19:32 IST)
బాలీవుడ్ దర్శకుడు ఓ రౌత్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు "ఆదిపురుష్". ప్రభాస్ - కృతి సనన్ జంటగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజువ‌ల్ వండ‌ర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రూ.400 కోట్ల మేర బ‌డ్జెట్ పెడుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 
 
అయితే మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతుండ‌టంతో ఈ సినిమా షూటింగ్‌ను ముంబై నుంచి హైద‌రాబాద్‌కు షిఫ్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమా బ‌డ్జెట్ పెర‌గ‌కుండా ఉండేందుకు ప్ర‌భాస్ స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.
 
నిజానికి ఈ చిత్ర షూటింగ్ మొన్నటి వరకు కూడా ముంబైలోనే జరిగింది. దాదాపు రెండు నెలలు అక్కడ పూర్తి చేసిన తర్వాత కరోనా కారణంగా హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశారు. ఇక్కడ మరో మూడు నెలల షూటింగ్‌కు ప్లాన్ చేశారు. అయితే షిఫ్టింగ్ చేసినపుడు నిర్మాతలకు అదనపు ఖర్చులు చాలా ఉంటాయి. బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతుంది. ఈ విషయంలో ప్రభాస్ చాలా కేర్ తీసుకుంటున్నారు. 
 
'ఆదిపురుష్' బడ్జెట్ పెంచ‌కుండా ప్ర‌భాస్ ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్ర షూటింగ్ 2021లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. అలా అయితేనే పోస్ట్ ప్రొడక్షన్ కోసం కనీసం ఆర్నెల్ల స‌మ‌యం తీసుకుని 2022 ఆగస్టుకు విడుదల చేయగలరు. ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్లని ప్రచారం జరుగుతుంది. అందులో 60 శాతం అంటే దాదాపు 250 కోట్లకు పైగా గ్రాఫిక్స్ కోసమే ఖర్చు చేస్తున్నారు. 
 
ఇండియాలో ఇప్పటివరకు చూడనటువంటి భారీ విజువల్ మైథలాజికల్ వండర్‌ను 'ఆదిపురుష్‌'లో చూపించాలని దర్శకుడు భావిస్తున్నారు. టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, ఓం రౌత్ లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
మరోవైపు, ఈ సినిమా షూటింగ్ అంతా దాదాపు గ్రీన్ మ్యాట్‌లోనే జరగబోతుందని తెలుస్తుంది. ఫైట్స్ నుంచి మొద‌లు పాట‌లు, సన్నివేశాలు అన్నీ విజువ‌ల్ గ్రాండియ‌ర్‌తోనే చూపించ‌బోతున్నారు. ఈయన గత సినిమా తానాజీ కంటే కూడా పదిరెట్లు గ్రాండ్‌గా 'ఆదిపురుష్' తెరకెక్కిస్తున్నారు. 
 
ఇప్పటివరకు ప్రభాస్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ మధ్యే హీరోయిన్ కృతి సనన్ కూడా జాయిన్ అయింది. త్వరలోనే ప్రభాస్, కృతి కాంబినేషన్‌లో ఓ భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండే పాటను చిత్రీకరించబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇచ్చిన సమాధానం : అమిత్ షా

Operation Sindoor: కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దు- పవన్ కల్యాణ్ (video)

OperationSindoor: మోదీ, భారత సాయుధ దళాలను కొనియాడిన చంద్రబాబు

భారత్ వెనక్కి తగ్గితే ఉద్రిక్తతలు నివారించేందుకు సిద్ధం : పాకిస్థాన్ శాంతిమంత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments