Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా ట్రిప్‌కు ఉచితంగా వెళ్లొచ్చని 'దేవదాసు'కు ఓకే చెప్పా : ఇలియానా

గోవా బ్యూటీగా గుర్తింపు నటి ఇలియానా. సుమారు 11 యేళ్ల క్రితం వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవదాసు’ చిత్రం ద్వారా అందాల సుందరి ఇలియానా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ప్రస్తుతం దక్షిణాదిలో సినిమా

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (13:08 IST)
గోవా బ్యూటీగా గుర్తింపు నటి ఇలియానా. సుమారు 11 యేళ్ల క్రితం వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవదాసు’ చిత్రం ద్వారా అందాల సుందరి ఇలియానా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ప్రస్తుతం దక్షిణాదిలో సినిమా అవకాశాలు లేక ఇంటికే పరిమితమైంది. కానీ, ప్రస్తుతం ఆమె నటించిన ‘ముబారక్’, ‘బాద్షాహో’ హిందీ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.
 
అయితే, ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవదాసు చిత్రంలో నటించే ఛాన్స్ ఏ విధంగా వచ్చిందో వివరించింది. తనకు అనుకోకుండా నటించే అవకాశం లభించిందని, అప్పుడు తన వయసు 15 సంవత్సరాలు మాత్రమేనని చెప్పింది. నిజం చెప్పాలంటే, అమెరికా ట్రిప్‌కు ఉచితంగా వెళ్లొచ్చని అప్పుడు తన మనసులో అనుకుని ఈ చిత్రంలో నటించేందుకు సమ్మతించినట్టు చెప్పింది. 
 
‘దేవదాసు’ సినిమా విడుదలైన తర్వాత, ప్రేక్షకుల స్పందన చూసేందుకు చిత్రయూనిట్‌తో కలిసి థియేటర్‌కు వెళ్లామని.. తన నటన నచ్చక ప్రేక్షకులు తనపై చెప్పులు విసురుతారేమోనని అనుకున్నానని, కానీ, తన నటన ప్రేక్షకులకు నచ్చడంతో ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments