Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ స్కామ్ : సిట్ ప్రశ్నావళి సిద్ధం... డ్రగ్స్ కొన్నారా? తెప్పించుకున్నారా?

హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ దందాలో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖుల వద్ద బుధవారం నుంచి విచారణ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో వారి ప్రమేయంపై వేయాల్సిన ప్రశ్నలను సిట

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (14:53 IST)
హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ దందాలో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖుల వద్ద బుధవారం నుంచి విచారణ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో వారి ప్రమేయంపై వేయాల్సిన ప్రశ్నలను సిట్ బృందం తయారు చేస్తోంది. డ్రగ్స్ నిందితుడి వద్దకు వారి ఫోన్‌నంబర్ ఎలా వచ్చింది? ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడారు? ఎప్పుడెప్పుడు మాట్లాడారు? 
 
ఒక అజ్ఞాత వ్యక్తితో అన్నిసార్లు మాట్లాడాల్సిన పనేంటి? డ్రగ్స్ కొన్నారా? వేరే వారితో తెప్పించుకున్నారా? అనే అంశాలపై సిట్ ఆరా తీయనున్నట్లు తెలిసింది. అలాగే ఫోన్లో మాట్లాడిన గొంతు ఎవరిదనే విషయాన్ని కూడా అవసరాన్ని బట్టి పరిశీలించే అవకాశం ఉంది. విచారణ సందర్భంగా నోటీసులు అందుకున్న ప్రముఖులు చెప్పే ప్రతీ అంశాన్ని వీడియో రికార్డు చేసి కేసు భవిష్యత్ పురోగతికి ఉపయోగించుకునే అవకాశముంది. 
 
అయితే, ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటూ నోటీసులు అందుకున్న ప్రముఖుల్లో కొందరు సిట్ అధికారులతో ఫోన్ ద్వారా టచ్‌లో ఉన్నట్లు సమాచారం. పలువురు ఆర్టిస్టులు నోటీసుల్లో పంపిన తేదీల్లో విచారణకు హాజరుకావడం కుదురదని, తమకు అసలు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే వివరణ ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది. 
 
కానీ, అధికారులు మాత్రం విచారణ సమయంలోనే అంతా చెప్పుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం. నిర్ధారిత తేదీల్లో విచారణకు రావడం కుదురడంలేదని, మరో తేదీకి అవకాశం కల్పించాలని కొందరు కోరుతున్న నేపథ్యంలో వారు విచారణకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments