Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి త‌న చిన్న అల్లుడుని ప‌ట్టించుకోలేక‌పోవ‌డానికి కార‌ణం అదేనా??! (video)

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (18:55 IST)
chiru-srija-kalyandev
మెగాస్టార్ చిరంజీవి త‌న కుమార్తె  శ్రీ‌జ వివాహంలో ప‌లు సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ఆయ‌నల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ గురించి చాలా కేర్ తీసుకుంటార‌ని మొద‌ట్లో అనుకున్నారు. అంద‌రూ అనుకున్న‌ట్లుగానే అల్లుడు హీరోగా `విజేత‌` అనే సినిమా తీశారు. మెగాస్టార్ వెన్నుద‌న్నుతో బ‌య‌ట నిర్మాత ఈ సినిమా తీశారు. ఆ సినిమాకు ప్ర‌మోష‌న్‌లో భాగంగా సినిమా విడుద‌ల‌య్యాక త‌న సినిమా విజేత‌తో కంపేర్ చేస్తూ చిరంజీవి పాజిటివ్‌గా మాట్లాడారు.

 
ఇక ఆ సినిమా త‌ర్వాత రెండో సినిమా క‌ళ్యాణ్‌దేవ్ హీరోగా సూప‌ర్ మ‌చ్చి విడుద‌లైంది. ఈ సినిమా ఎప్పుడు మొద‌లైందో ఎప్పుడు విడుద‌లైందో కూడా తెలీకుండా జ‌రిగింది. విడుద‌ల‌కు క‌రోనా వ‌ల్ల బ్రేక్ ప‌డుతుంద‌ని అనుకున్నారు. కానీ నిర్మాత‌లు ఒత్తిడిమేర‌కు సంక్రాంతికి పెద్ద సినిమాలు లేక‌పోవ‌డంతో విడుద‌ల‌ చేశారు. క‌నీసం చిత్ర ప్ర‌మోష‌న్ కూడా నిర్మాత‌లు ముందుకు రాలేదు. దానికి కార‌ణం మెగాస్టార్ చిరంజీవి ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే. 

 
దీనికి కార‌ణం గ‌త కొంత‌కాలంగా క‌ళ్యాణ్‌దేవ్ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పులు రావ‌డంతో శ్రీ‌జ కూడా దూరంగా పెట్టింద‌ని తెలుస్తోంది. శ్రీ‌జ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా కొణిదెల ప్రొడక్ష‌న్ సినిమాలకు వ్య‌వ‌హ‌రిస్తోంది. అంతేకాకుండా  వెబ్ సిరీస్ కూడా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. కానీ ఎక్క‌డా క‌ళ్యాణ్‌దేవ్ ప్ర‌స్తావ‌న రాలేదు. ఆయ‌న్ను సినిమాలో ఏదైనా వేషం కూడా వేయించవ‌చ్చు. కానీ క‌ళ్యాణ్‌దేవ్ చెప్పింది విన‌డ‌నీ, త‌ను వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు అల‌వాటు ప‌డ్డాడ‌నే టాక్ ఇండ‌స్ట్రీలో నెల‌కొంది. దీనితో గ‌త కొంత‌కాలంగా ఆయ‌న్ను దూరం పెట్టార‌ని తెలిసింది. ఇక నిన్న‌నే శ్రీ‌జ కొణిదెల అంటూ ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్ట‌డంతో ఇది మ‌రింత ప్ర‌చారం జ‌రిగింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

వాట్సాప్ వైద్యం వికటించింది.. గర్భశోకాన్ని మిగిల్చింది...

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments