Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా బ్లాక్‌బస్టర్ : ఆల్టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ జాబితాలో 'జై లవ కుశ'

దసరా పండుగకు విడుదలైన చిత్రాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన "జై లవ కుశ" చిత్రం నిలిచింది. బాబీ దర్శకత్వంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 21వ తేదీన ర

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2017 (10:44 IST)
దసరా పండుగకు విడుదలైన చిత్రాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన "జై లవ కుశ" చిత్రం నిలిచింది. బాబీ దర్శకత్వంలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 21వ తేదీన రిలీజ్ అయిన విషయం తెల్సిందే. 
 
దసర పండుగ రోజుల్లో ఈ సినిమా ఒక రేంజ్‌లో సందడి చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లతో దూసుకుపోయింది. ఇప్పటికీ ఈ సినిమా జోరు తగ్గకపోవడం విశేషం. ఇంతవరకూ ఈ సినిమా రూ.125 కోట్లపై పైగా గ్రాస్‌ను వసూలు చేసింది.
 
ఈ యేడాది ఈ స్థాయి వసూళ్లను సాధించిన 3వ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి ముందు 'బాహుబలి 2', 'ఖైదీ నెంబర్ 150' వున్నాయి. ఇక తెలుగులో ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన చిత్రాల్లో 'జై లవ కుశ' 8వ స్థానాన్ని సంపాదించుకుంది.
 
అలాగే, మొదటి ఏడు స్థానాల్లో బాహుబలి, బాహుబలి 2, ఖైదీ నెంబర్ 150, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, అత్తారింటికి దారేది, సరైనోడు సినిమాలు ఉన్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ మూడు పాత్రలను పోషించిన ఈ సినిమా, ఆయన కెరియర్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments