Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేము తెలుగు హీరోయిన్స్ అంటూ బిగ్గరగా కేకలు వేస్తున్న ఆ ఇద్దరు!

వరుణ్ ధావన్, తాప్సీ, జాక్వలైన్ ఫెర్నాండేజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం "జుడ్వా-2". 1997లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం 'జుడ్వా' (హరో బ్రదర్‌కి రీమేక్)కి ఇది రీమేక్ కాగా, డేవిడ్ ధావన్ ఈ చిత్రాన్ని

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (08:59 IST)
వరుణ్ ధావన్, తాప్సీ, జాక్వలైన్ ఫెర్నాండేజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం "జుడ్వా-2". 1997లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం 'జుడ్వా' (హరో బ్రదర్‌కి రీమేక్)కి ఇది రీమేక్ కాగా, డేవిడ్ ధావన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈనెల 29వ తేదీ ఈ చిత్రం విడుదల కానుంది.
 
ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ వినూత్న ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఇందులో నటించిన ప్రధాన పాత్రధారాలు వరుణ్, తాప్సీ, జాక్వలైన్ తమకి నచ్చిన స్టైల్‌లో సినిమాని జనాలలోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో వరుణ్ ధావన్ తాజాగా తన ట్విట్టర్ ద్వారా ఓ వీడియో పోస్ట్ చేశాడు. నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం. మొదటిసారి తెలుగు భాషలో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేశాడు. 
 
అయితే ఈ వీడియోలో వరుణ్ ఓ వ్యక్తి సాయం తీసుకొని నాకు తెలుగు హీరోయిన్ కావాలని తెలుగులో చెప్పాడు. అప్పుడే వెనుక నుండి వచ్చిన తాప్సీ, జాక్వలైన్‌లు మేము తెలుగు హీరోయిన్స్ అంటూ గట్టిగా అరిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments