Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరో ఛాన్స్ మిస్ చేసుకోనంటున్న హీరోయిన్... ఎవరు?

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (15:12 IST)
టాలీవుడ్ ప్రిన్ మహేష్ బాబు నటించే తాజా చిత్రం "సర్కారు వారి పాట". 'గీత గోవిందం' దర్శకుడు పరుశురాం క్రేజీ ప్రాజెక్టు. ఈ చిత్రం టైటిల్ లోగోను ఇటీవల రిలీజ్ చేయగా, అది సోషల్ మీడియాలో ఓ సంచలనమే సృష్టించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరా? అంటూ చర్చలు మొదలయ్యాయి.
 
ఈ చిత్రంలో నటించేందుకు ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లను ఎంపిక చేశారు. కానీ, పేరును మాత్రం ఇంకా ఖరారు చేయలేదట. ఎందుకంటే.. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించేందుకు 'భరత్ అనే నేను' ఫేమ్ కియారా అద్వానీని మేకర్స్ సంప్రదించారట. 
 
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న కియారా ముందు 'డేట్స్ అడ్జస్ట్ చేయలేను' అని చెప్పినప్పటికీ.. ఈ కరోనా గ్యాప్‌తో కాస్త డేట్స్ అటు ఇటు అయ్యే అవకాశం ఉండటంతో.. పరిస్థితులను చూసుకుని చెబుతానని చెప్పినట్లుగా తెలుస్తుంది. 
 
ఎందుకంటే టాలీవుడ్‌లో తనకి బంపర్ హిట్ ఇచ్చిన మహేష్ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని కియారా కూడా భావిస్తుందట. అందుకే మేకర్స్ హీరోయిన్ విషయంలో ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. ఒక్కసారి కియారా డేట్స్ అడ్జస్ట్ చేయగానే అఫీషియల్‌గా ఆమె పేరును చిత్రయూనిట్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments