Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డి వెంటపడిన మణిరత్నం... ఎందుకంటే...

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోనే కాదు అటు తమిళం ఇటు హిందీ బాషల్లోను హీరో విజయ్ దేవరకొండ పేరు అమాంతం పెరిగిపోయింది. తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న విజయ్ దేవరకొండకు ప్రస్తుతం అవకాశాలు తన్నుకొస్తున్నాయి. అది కూడా ఒకటి రెండు కాదు ఏక

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (21:17 IST)
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోనే కాదు అటు తమిళం ఇటు హిందీ బాషల్లోను హీరో విజయ్ దేవరకొండ పేరు అమాంతం పెరిగిపోయింది. తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న విజయ్ దేవరకొండకు ప్రస్తుతం అవకాశాలు తన్నుకొస్తున్నాయి. అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యల్లో సినిమాలు, మూడు భాషల్లో సినిమా నటించే అవకాశం. 
 
తాజాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం విజయ్ దేవరకొండ వెంటపడిపోయారు. విజయ్ కోసం ఇప్పటికే మణిరత్నం ఒక కథను కూడా సిద్థం చేసేశారట. విజయ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు ఈ సినిమా ఉంటుందని మణిరత్నం చెబుతున్నారు. దర్శకులని వెళ్ళి హీరోలు కలవడం వినుంటాం. కానీ ఇక్కడ హీరోను దర్శకుడు కలిసి నాకు కొన్ని రోజులు టైం కేటాయించూ అంటూ అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి. అది విజయ్ దేవరకొండ టాలెంట్. 
 
ఇప్పుడు వీరిద్దరి కలయికలో రానున్న సినిమాపైన తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చాలా రోజుల గ్యాప్ తరువాత మణిరత్నం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను చేయనుండటం అందులో విజయ్ హీరో కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments