Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్యా రాయ్‌కి జోడీగా 'కలెక్షన్ కింగ్' మోహన్ బాబు... మణిరత్నం దర్శకత్వంలో....

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (18:26 IST)
తమిళంలో పేరుగాంచిన రైటర్ కల్కి రచించిన 'పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా, విజయ్, మహేష్ బాబు ప్రధాన పాత్రల్లో సినిమా తీయాలని స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రయత్నించినప్పటికీ వర్క్అవుట్ కాలేదు.

తాజాగా ఈ సినిమా కోసం జయం రవి, విక్రమ్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, మోహన్ బాబుతో మణిరత్నం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అరుల్ మోళి వర్మన్ పాత్రలో జయం రవి, ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్‌ను నటింపజేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ని కూడా నందిని పాత్ర కోసం ఎంపిక చేయడం ఆసక్తి కలిగిస్తోంది.
 
ఈ నవలలో నందినిది చాలా కన్నింగ్ పాత్ర. పెరియా పళువెటరాయర్‌ను బలవంతంగా పెళ్లి చేసుకుంటుంది. పెరియా పళువెటరాయర్‌ పాత్ర కోసం మోహన్ బాబును అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకా దీని గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. క్యాస్టింగ్ ఫైనలైజ్ అయిన తర్వాత ఈ భారీ బడ్జెట్ సినిమా గురించి ప్రకటించే అవకాశముంది. 
 
వరుస ప్లాపులతో తడబడిన మణిరత్నం గతేడాది తమిళంలో చేసిన ‘చిక్క చివంత వానమ్' సినిమా మంచి విజయం సాధించింది. ‘పొన్నియిన్ సెల్వన్' నవల రాయడానికి రచయితకు సుమారు మూడేళ్ల సమయం పట్టింది. మరి ఈ సినిమా పూర్తవడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments