Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూకు కానుకగా కారు- బాహుబలి-2ని చూడకుండా బయటికొచ్చేసిన సమంత? ఎందుకు?

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత-నాగచైతన్యలు త్వరలో దంపతులు కానున్నారు. సమంతకు సామాజిక సేవ చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే నాగచైతన్యకు కార్లు కొనడం అంటే ఇష్టం. కార్ల మోడల్స్ గురించి అప్పుడప్పుడు చైతూ ఆరా తీస్త

Webdunia
గురువారం, 4 మే 2017 (16:51 IST)
టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత-నాగచైతన్యలు త్వరలో దంపతులు కానున్నారు. సమంతకు సామాజిక సేవ చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే నాగచైతన్యకు కార్లు కొనడం అంటే ఇష్టం. కార్ల మోడల్స్ గురించి అప్పుడప్పుడు చైతూ ఆరా తీస్తుంటాడు. తాజాగా చైతూ గ్యారేజ్‌లోకి కొత్త కారొచ్చి చేరింది. ఈ కారును చైతూకు కాబోయే భార్య సమంత బహుమతిగా ఇచ్చిందట.
 
ఏప్రిల్ 28న పుట్టిన రోజు వేడుకలు జ‌రుపుకున్న స‌మంత.. ఈ సందర్భంగా తన ప్రియునికి బీఎమ్‌డ‌బ్ల్యూ 7 సిరీస్ లేటెస్ట్ మోడ‌ల్ కారును బుక్ చేసింద‌ట‌. ఈ కారు ధ‌ర దాదాపు కోటిన్న‌ర ఉంటుంద‌ని సమాచారం. అలాగే పుట్టినరోజు సందర్భంగా సమంత చిన్నారులను తీసుకెళ్లింది. కానీ రికార్డులు, కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న 'బాహుబలి: ది కన్ క్లూజన్' సినిమాకు వెళ్లిన సమంత.. పట్టుమని అరగంట కూడా సినిమా చూడకుండానే బయటకు వచ్చేసిందట. 
 
దాదాపు 35 మంది చిన్నారులతో హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లిన సమంత.. సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత బయటకు వచ్చేయడానికి ఏసీనే కారణమట. థియేటర్లో ఏసీ సరిగ్గా పనిచేయకపోవడంతో ఊపిరాడక సమంత బయటికి వచ్చేసినట్లు తెలుస్తోంది. 
 
ఈ సినిమా థియేటర్‌ యాజమాన్యంపై బాహుబలి టీమ్ అసంతృప్తి వ్యక్తం చేయగా.. థియేటర్ యజమాని సారీ చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ సమంత మిగిలిన సినిమా చూసిందో లేదో కానీ.. బాహుబలి2ని మాత్రం అభినందిస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేసేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ జీ... వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్ కావాలి.. ఇది మనం చేయాలి... : ప్రధాని మోడీ

Chandrababu: రైతన్నల కష్టమే అమరావతి- ఏపీ చరిత్రలో ఒక స్వర్ణ దినం -చంద్రబాబు (video)

అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి: ప్రధానమంత్రి నరేంద్ర మోడి (video)

2011లో జరిగిన పెళ్లి.. వరుడికి గిఫ్టుగా హెలికాప్టర్.. 30వేల మంది అతిథులు

పవన్ కళ్యాణ్‌కు బహుమతి ఇచ్చిన ప్రధాని మోడీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

తర్వాతి కథనం
Show comments