Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాప్ స్టార్‌తో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తోన్న పూరి..!

ఆకాష్ పూరితో మెహబూబా చిత్రాన్ని తెర‌కెక్కించిన పూరికి నిరాశే ఎదురైంది. అయితే... పూరికి ఖాళీగా ఉండ‌టం ఇష్టం ఉండ‌దు. అందుచేత‌ ఆకాష్‌తోనే తర్వాతి చిత్రం తీసేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే... ఈమధ్యలో ఓ స్టార్‌ హీరోకు కథను వినిపించి ప్రాజెక్

Webdunia
మంగళవారం, 22 మే 2018 (21:26 IST)
ఆకాష్ పూరితో మెహబూబా చిత్రాన్ని తెర‌కెక్కించిన పూరికి నిరాశే ఎదురైంది. అయితే... పూరికి ఖాళీగా ఉండ‌టం ఇష్టం ఉండ‌దు. అందుచేత‌ ఆకాష్‌తోనే తర్వాతి చిత్రం తీసేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే... ఈమధ్యలో ఓ స్టార్‌ హీరోకు కథను వినిపించి ప్రాజెక్టును ఖరారు చేసుకున్నాడని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఇంత‌కీ.. ఎవ‌రా టాప్ హీరో అనుకుంటున్నారా..? టాలీవుడ్ కింగ్ నాగార్జున‌. మెహబూబా చిత్ర విడుదలకు ముందే నాగార్జునకి పూరి ఓ కథను వినిపించారట. ఎమోషనల్‌ కంటెంట్‌తో ఉన్న ఆ కథ నచ్చటంతో నాగ్‌ ఓకే చేశాడని, పైగా నాగ చైతన్యతో అది మల్టీస్టారర్‌గా తెరకెక్కించబోతున్నాడని ఆ కథనం సారాంశం.
 
మెహబూబా ఫలితంతో సంబంధం లేకుండా మరీ ఆ ప్రాజెక్టును నాగ్‌ కమిట్‌ అయినట్లు ఆ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే... నానితో చేస్తున్న మల్టీస్టారర్‌, బంగార్రాజు ప్రాజెక్టు పూర్తయ్యాక పూరితో మల్టీస్టారర్‌ ప్రారంభిస్తారట‌. దీనిపై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ రావాల్సివుంది. గతంలో నాగ్ - పూరి కాంబోలో శివమణి, సూపర్‌ చిత్రాలు వచ్చాయి. దాదాపు దశాబ్దంకు పైగా గ్యాప్‌ తర్వాత వీళ్లు మళ్లీ క‌లిసి సినిమా చేస్తుండ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments