Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ మూవీ గురించి వర్రీ అవుతున్న నాగ్

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (17:57 IST)
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పైన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యువ నిర్మాతలు బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో అఖిల్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ సీన్స్‌ను చెన్నైలో చిత్రీకరించారు. 
 
అఖిల్ మరికొంత మంది ఫైటర్స్ పైన ఫైట్ సీన్స్ చిత్రీకరించారు. అయితే.. ఈ సీన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు అఖిల్‌కి గాయాలు అయ్యాయి. దీంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది.
 
 ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమాలోని మనసా మనసా సాంగ్ విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇందులో అఖిల్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా నటిస్తున్నాడు. 
 
అఖిల్, పూజా హేగ్డేలపై చిత్రీకరించిన లవ్ సీన్స్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయని.. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓ కొత్త సినిమాని చూసిన ఫీలింగ్ కలిగిస్తుందని టీమ్ మెంబర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. 
 
ఇదిలా ఉంటే... నాగార్జున తను నిర్మించే సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. ఎడిటింగ్ రూమ్‌లో నాగార్జున ఇచ్చిన సలహాలు వలన అవుట్ పుట్ బాగా వచ్చి సినిమాలు సక్సస్ అయిన సందర్భాలు ఉన్నాయి. 
 
ఈమధ్య కాలంలో నాగార్జున నిర్మించిన సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం.. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించడానికి నాగార్జున అందించిన సలహాలు కూడా ఓ కారణం అని చెప్పచ్చు. ఇక అసలు విషయానికి వస్తే.... నాగార్జున అఖిల్ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకున్నారు తీసుకుంటున్నారు కూడా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా ఇప్పటివరకు అయిన షూటింగ్ అవుట్‌పుట్‌ను నాగార్జున పరిశీలిస్తున్నారని సమాచారం.
 
ఎడిటింగ్ విషయంలో నాగార్జున కాంప్రమైజ్ కాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్‌తో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే రఫ్ కట్స్ అన్ని చూసి దర్శకునికి ఎడిటింగ్ టీంకి కొన్ని సూచనలు సూచించారని తెలిసింది. ఈ సినిమాపై నాగ్, అఖిల్‌తో పాటు అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఒక పాట కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సివుంది. ఏప్రిల్‌లో మిగిలిన సాంగ్, కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
మే నెలలో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ... మేలో మోస్ట్ ఎలిబిజుల్ బ్యాచ్‌లర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే అని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. 
 
తాజా సమాచారం ప్రకారం.. జూన్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని తెలిసింది. అఖిల్.. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో ఆశించిన విజయం సాధిస్తాడో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments