Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ పెళ్లి రద్దు.. బాగా అప్‌సెట్ అయిన నాగ్.. ఫోన్ నంబర్ మార్చేశాడు!

టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని, డిజైనర్ శ్రియా భూపాల్ రెడ్డిల వివాహం రద్దు అయినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి పెళ్లి కాన్సిల్ అయిందన్న వార్త ఇటు తెలుగు సినీ ప్రపంచంతో పాటు సామాన్యులవర

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (13:05 IST)
టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని, డిజైనర్ శ్రియా భూపాల్ రెడ్డిల వివాహం రద్దు అయినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి పెళ్లి కాన్సిల్ అయిందన్న వార్త ఇటు తెలుగు సినీ ప్రపంచంతో పాటు సామాన్యులవరకు కుదిపేసింది. ఆ ఘటన అటు నాగార్జునకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని ఫిల్మ్‌నగర్‌ వర్గాల టాక్. కానీ, ఈ వార్తలను ఇటు వరుడు, అటు వధువు కుటుంబ సభ్యులు ఖండించలేదు. అలాగనీ మాటమాత్రం కూడా స్పందించడం లేదు. 
 
కానీ, ఈ వ్యవహారంతో హీరో నాగార్జున మాత్రం బాగా అప్‌సెట్ అయ్యారట. ఆ వార్త బయటకు రాగానే నాగార్జునకు సన్నిహితంగా ఉండేవాళ్లంతా ఒకటే ఫోన్లు చేశారట. పెళ్లి కాన్సిల్ అయిందట కదా అని పదే.. పదే అడిగారట. అది నిజమా.. కాదా? అని ఆరా తీశారట. అంతేకాదు.. మరికొందరు ఇంకొంచెం ముందుకు వెళ్లి అఖిల్‌కు మరింత బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందంటూ ఓదార్చారని టాక్. 
 
అయితే.. తన బాగు కోరే వాళ్లు అలా ఫోన్లు చేసేసరికి.. వారికి ఏం చెప్పాలో నాగార్జునకు అర్థంకాక సతమతమైపోయాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. నిజం చెప్పాలో.. లేదంటే సమాధానం దాటవేయాలో తెలియక తీవ్ర ఇబ్బంది పడుతున్నారట. దీంతో ఇన్ని తలనొప్పులు భరించే కన్నా.. ఫోన్ నంబర్‌ను మార్చేస్తే బాగుంటుందని కింగ్ నాగ్ భావించి, తన మొబైల్ ఫోన్ నంబరును మార్చివేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments