Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకు ఆ హీరోయినే కావాలంటున్న యువ హీరోలు... ఎందుకు?

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (20:05 IST)
నిధి అగర్వాల్.. గతేడాది మున్నా మైఖేల్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన హిందీలో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది తెలుగు తెరకు కూడా పరిచయం అయ్యింది. నాగచైతన్య నటించిన‌ 'సవ్యసాచి' చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టి తన టాలెంట్‌తో ఇక్కడి వారిని మంత్రముగ్దుల్ని చేసింది. ఇటీవలే విడుదలయిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌కి మంచి పేరు రాగా తన అద్వితీయ నటనతో అందరిని ఆకట్టుకుంది. చిత్రంలో తన పాత్రకు వంద శాతం న్యాయం చేకూర్చగా డ్యాన్స్ అభినయంతో సినిమాలో తనే హైలైట్‌గా నిలిచింది. 
 
తొలి చిత్రంతోనే అందరిని ఆకట్టుకున్న ఈమెకి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. బాలీవుడ్‌లో తనదైన మార్క్ వేసుకున్న ఈ సన్నజాజి టాలీవుడ్‌లోనూ అదే రీతిలో రాణించి బడా హీరోయిన్ల లిస్టులోకి వెళ్లాలని ప్రేక్షకులు కోరుతుండగా ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు చూస్తే అదేమంత దూరంలో ఉన్నట్లు కనిపించడం లేదు. 
 
ఈ చిత్రంతో పాటు అఖిల్‌ 'మిస్టర్ మజ్ను' చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. వరుసగా ఇద్దరు అక్కినేని హీరోల సినిమాలు చేస్తున్న ఈ అక్కినేని వారి భామకి ఇతర హీరోల సినిమా హీరోల దగ్గర నుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయట. మరి.. టాలీవుడ్ అందాల నిధి గ్లామర్ మెరుపులు వెండితెరపై త్వరలో చూడొచ్చన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments