Webdunia - Bharat's app for daily news and videos

Install App

వకీల్ సాబ్ హిట్‌తో నివేదా థామస్ హ్యాపీ... కానీ చేతిలో ఒక్కటి కూడా లేదట

Webdunia
సోమవారం, 3 మే 2021 (20:23 IST)
వకీల్ సాబ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు ఎంత పేరు వచ్చిందో ఇందులో నటించిన ముగ్గురు హీరోయిన్లు నివేదా థామస్, అంజలి, అనన్య వీరికి కూడా అంతే పేరు తెచ్చిపెట్టింది. అందులోను నివేదా గురించి ఇక్కడ ఎక్కువ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించిన నివేదకు పెద్దగా మైలేజ్ రాలేదు.
 
అన్ని సినిమాల్లోను ఈమెకు పెద్దగా మార్కులు కూడా పడలేదు. కానీ వకీల్ సాబ్ సినిమాలో నివేద పరిణితి చెందిన యువతిగా నటించిన తీరు... అస్సలు ఆ క్యారెక్టర్‌కు ఆమే కరెక్టుగా చేసిందన్న అభిమానుల ప్రశంసలు ఎక్కువగా వినిపించాయి. ఇక నివేద థామస్‌ తిరుగులేదనుకున్నారు.
 
రాబోయే సినిమాల్లో ఎక్కువగా నివేదకే అవకాశాలు తన్నుకొస్తున్నాయని అందరూ భావించారు. అసలే కరోనా కాలం. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేయడం కష్టతరంగా మారుతోంది. కరోనాకు ముందు ప్రారంభమైన ఈ వకీల్ సాబ్ కాస్త ఎలాగోలా పూర్తి చేసుకుంది విడుదలైంది. మంచి సక్సెస్‌ను సాధించింది.
 
నివేదకు సినిమా మంచి విజయాన్ని తెచ్చిపెట్టడంతో పాటు సినిమాలోని తన క్యారెక్టర్ పల్లవి అనే పేరు చిరస్థాయికి నిలిచిపోతుందన్న నమ్మకంతో ఆమె ఉంది. ఇప్పుడు స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న నివేద వారితో తన బాధను కూడా పంచుకుందట. ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ సంపాదించాను కానీ... చేతిలో సినిమాల్లేవు అంటూ బాధపడుతోందట ఈ అమ్మడు. మరి కరోనా పోయిన తర్వాతైనా ఆఫర్లు వస్తాయోమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments