Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి "తొలిప్రేమ" సినిమాలో కనిపించనున్న పవన్ కళ్యాణ్??

తొలిప్రేమ సినిమా "పవన్ కళ్యాణ్" సినీ జీవితంలో నేటికీ ఒక మరుపురాని చిత్రంగా ఉంది. ఈ చిత్రం కమర్షియల్‌గానే కాకుండా తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. 1998వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాకి కరుణాకరణ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం టైటిల్‌తో 20 ఏళ్ల తర

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (17:47 IST)
తొలిప్రేమ సినిమా "పవన్ కళ్యాణ్" సినీ జీవితంలో నేటికీ ఒక మరుపురాని చిత్రంగా ఉంది. ఈ చిత్రం కమర్షియల్‌గానే కాకుండా తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. 1998వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాకి కరుణాకరణ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం టైటిల్‌తో 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ మన ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ నెట్‌లో హల్చల్ చేస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 
 
రాశీఖన్నా వరుణ్ తేజ్‌కి జోడీగా నటిస్తోంది. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక విషయం హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కొంతసేపు వరుణ్‌తేజ్‌తో పాటుగా స్క్రీన్‌పై కనిపించబోతున్నారని సమాచారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌‌కి వరుణ్ తేజ్, నాగబాబులపై ఉన్న అభిమానంతో ఇందుకు ఒప్పుకున్నాడని సమాచారం.
 
గతంలో ఇదే బ్యానర్‌లో పవన్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్రాన్ని నిర్మించిన బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మధ్య ఉన్న సాన్నిహిత్యంతో పవన్ ఈ చిత్రంలో కనిపించడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు భోగట్టా. గతంలోనూ పవన్ శంకర్‌దాదా జిందాబాద్ చిత్రంలోనూ అతిథిపాత్రలో మెరిసాడు. ఇక ఆ చిత్రంలో తాను ఎలాంటి క్యారెక్టర్ పోషిస్తున్నాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం పవన్ కళ్యాణ్ సంక్రాంతికి రిలీజ్‌కానున్న తన "అజ్ఞాతవాసి" సినిమా ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?

pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments