Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బర్త్‌ డే' శుభవార్త : మళ్లీ తండ్రికాబోతున్న పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు వేడుకలను శనివారం జరుపుకుంటున్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఆయన పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (12:11 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు వేడుకలను శనివారం జరుపుకుంటున్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఆయన పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, పవన్ ఫ్యాన్స్ అభిమానానికి అంతేలేకుండా పోయింది. ఈ పుట్టినరోజు శుభతరుణంలో పవన్ మరో శుభవార్తను వెల్లడించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ తండ్రికాబోతున్నాడనేది ఆ గుడ్ న్యూస్. 
 
నిజానికి పవన్ కళ్యాణ్ .. రేణు దేశాయ్ దంపతులకు అకీరా నందన్ - ఆధ్య అనే ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా రేణు దేశాయ్‌కి పవన్ దూరంగా ఉంటున్నా, పిల్లలిద్దరికీ ఆయన ఎప్పుడూ టచ్‌లోనే ఉంటూ వస్తున్నారు. వాళ్ల ఆనందం కోసం తగిన సమయాన్ని కేటాయిస్తూనే ఉన్నారు. 
 
రేణుతో వివాహ బంధం తెగిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్... 'అన్నా లెజ్ నొవా'తో తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరిద్దరికీ 'పొలేనా' అనే కూతురు ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి పవన్ తండ్రి కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం గర్భంతో ఉన్న అన్నా లెజ్ నొవాకి వైద్యులు అక్టోబర్ 14వ తేదీని డెలివరీ డేట్‌గా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. పవన్ అభిమానులకు ఇది ఆనందాన్ని కలిగించే విషయమే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments