Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీత గోవిందం డైరెక్టర్ దగ్గర్నుంచి అడ్వాన్స్ మనీ వాపస్ తీసుకున్న సంస్థ, ఎందుకు?

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (15:50 IST)
యువత సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై.. తొలి ప్ర‌య‌త్నంలో విజ‌యం సాధించి.. సోలో సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ సాధించిన యువ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్. సారొచ్చారు సినిమాతో స‌క్స‌స్ సాధించ‌లేక‌పోయిన శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో తెర‌కెక్కించిన గీత గోవిందం సినిమాతో బ్లాక్‌బ‌ష్ట‌ర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసారు.
 
 దీంతో ప‌ర‌శురామ్‌తో సినిమాలు చేసేందుకు హీరోలు, నిర్మాత‌లు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమా త‌ర్వాత కొన్ని నిర్మాణ సంస్థ‌లు ప‌ర‌శురామ్‌కి అడ్వాన్సులు ఇచ్చాయి. గీత గోవిందం సినిమా త‌ర్వాత సినిమా చేయ‌మ‌ని అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాణ సంస్థ‌లు ప‌ర‌శురామ్ పైన ఒత్తిడి పెంచాయి. ఈసారి పెద్ద సినిమా చేయాల‌ని పట్టుద‌ల‌తో ఉన్న ప‌ర‌శురామ్ నాగ చైత‌న్య‌తో సినిమా చేయ‌నున్నాడు.
 
ఈ సినిమాని 14 రీల్స్ బ్యాన‌ర్లో చేస్తున్నాడు. దీంతో ప‌ర‌శురామ్‌కి అడ్వాన్స్ ఇచ్చిన మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ త‌మ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమ‌న్న‌ద‌ట‌. ఈ సంస్థ‌కు 2.80 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వుందట‌.. కోటి రూపాయలు వెనక్కు ఇచ్చారని తెలిసింది. మిగిలిన మొత్తం కూడా వెంటనే ఇవ్వమని కోరిన‌ట్టు స‌మాచారం. అదీ సంగ‌తి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments