Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్ స్టార్‌డ‌మ్ దిశ‌గా ప్ర‌భాస్!

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (15:32 IST)
Prabhas-1
ప్ర‌భాస్‌కు సంబంధించిన కొత్త వార్త అభిమానుల్లో నెల‌కొంది. ఇప్ప‌టికీ బాలీవుడ్‌లో షూటింగ్ నిమిత్తం సెటిల్ అయినా ఆయ‌న్ను బాలీవుడ్ స్థాయి నుంచి హాలీవుడ్ స్థాయికి ప్ర‌భాస్‌ను తీసుకెళ్ళానేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు తాజా స‌మాచారం. ఈ వార్త అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది. హాలీవుడ్‌లో సంచలనం రేపిన ‘రాంబో’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు దర్శకుడు సిద్ధార్త్ ఆనంద్ ప్రయత్నాలు చేస్తున్నాడ‌ని స‌మాచారం. ఈ బ్లాక్‌బస్టర్ రీమేక్ కోసం హీరో అన్వేషణలో మొదట హీరోగా టైగర్ ష్రాఫ్‌ని అనుకున్నారట. రాంబో పాత్రలో నటించేందుకు కావాల్సిన ఫిజిక్ టైగర్ ష్రాఫ్ ‌లో ఉండటంతో అతనే ఈ పాత్రకి పర్‌ఫెక్ట్ అని దర్శకుడు భావించాడట !

కానీ ఇప్పుడు ఎందుకో ఈ దర్శకుడు మనసు మార్చుకుని రాంబో పాత్ర కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్‌కి  దర్శకుడు సిద్ధార్త్ స్క్రిప్ట్ కూడా వినిపించాడని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పై ప్రభాస్ ఎలాంటి సమాధానం ఇచ్చాడన్నది తెలియాల్సి ఉంది . ఒకవేళ ఈ ప్రాజెక్టే ఓకే అయితే ప్ర‌భాస్‌కు హాలీవుడ్ రేంజ్‌లో స్టార్‌డమ్ ఖాయమని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫహల్గామ్ ఘటన.. తిరుమలలో అలెర్ట్- టీటీడీ యంత్రాంగం అప్రమత్తం (video)

చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్టు.. లింగ నిర్ధారణకు పోలీసుల నిర్ణయం!

ఉగ్రవాదులకు ఆశ్రయమా? సిగ్గుపడాలి.. పాక్ ప్రధానిని ఏకిపారేసిన మాజీ క్రికెటర్

మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments