Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2:: తమన్నా సీన్స్‌ను జక్కన్న కట్ చేసేశాడా?

బాహుబలి పార్ట్-1లో తమన్నా అందాలతో పాటు.. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేసింది. అయితే రెండో పార్ట్ అంటే "బాహుబలి కన్‌క్లూజన్‌"లో మాత్రం తమన్నా కొన్ని సీన్స్‌కే పరిమితం అయ్యింది. శివుడుతో బాహుబలి ది బిగినిం

Webdunia
శనివారం, 6 మే 2017 (16:10 IST)
బాహుబలి పార్ట్-1లో తమన్నా అందాలతో పాటు.. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేసింది. అయితే రెండో పార్ట్ అంటే "బాహుబలి కన్‌క్లూజన్‌"లో మాత్రం తమన్నా కొన్ని సీన్స్‌కే పరిమితం అయ్యింది. శివుడుతో బాహుబలి ది బిగినింగ్‌లో అందాల ఆరబోసిన తమన్నాకు రచయిత, విజయేంద్ర ప్రసాద్‌ నుంచి మంచి మార్కులు పడ్డాయి. గ్లామర్‌తో ఓ వైపు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. యాక్షన్ సీన్లలో తమన్నా ఆకట్టుకుంది. 
 
''పచ్చబొట్టు'' సాంగ్ ఈమె గ్లామర్‌కు ప్లస్ పాయింట్ అయ్యింది. కానీ రెండో పార్టులో తమన్నా బాగా మిస్సయ్యింది. దేవసేనగా అనుష్క పాత్ర చుట్టే కథ నడవడంతో తమన్నాను దర్శకుడు హైలైట్ చేయలేదు. రానాకు-శివుడికి యుద్ధం జరుగుతున్న సమయంలో.. నాలుగైదు సీన్లలో ఆమెను చూపించారే తప్ప.. ఆమె పాత్రకు రాజమౌళి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇందుకు కారణం లేకపోలేదు. 
 
రానా-ప్రభాస్ తాలూకు వార్ సీన్ల గ్రాఫిక్ వర్క్ ఓ కంపెనీ చేసింది. ఈ సీన్స్ మధ్యలో తమన్నా పోరాటాలు వాటిలో ఇరికించాల్సి వచ్చింది. కానీ తమన్నాను ఆ సీన్లలో యాడ్ చేసే గ్రాఫిక్స్ పనిని వేరే కంపెనీ చేసింది. అయితే తమన్నాను రానా-ప్రభాస్ వార్ సీక్వెన్స్‌కు అనుగుణంగా జతపరచిన గ్రాఫిక్స్ వర్క్ ఏమాత్రం నప్పలేదట. అందుకే రాజమౌళి తమన్నా పార్టును కత్తిరించిపారేశాడని టాక్.
 
సన్నివేశాలకు కనెక్ట్ కానీ గ్రాఫిక్ వర్కుతో కూడిన తమన్నా సీన్స్ పెడితే సినిమాకు నెగటివ్ టాక్ వస్తుందని.. అందుకే తమన్నా పాత్ర పోయినా పర్లేదు కానీ.. ఆడియన్స్ ఎక్కడా విజువల్ ఫీల్ మిస్ కాకుండా చూడాలని జక్కన్న ఈ పని చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. కానీ తన సీన్స్ కట్ చేయడంపై తమన్నా కోప్పడుతుందని జక్కన్న అనుకున్నాడు. కానీ తమన్నాకు జక్కన్నపై ఎలాంటి కోపం రాలేదట. బాహుబలి లాంటి సినిమాలో చిన్న రోల్ చేసినా సంతోషమేనని ఈ పాలరంగు చిన్నది రాజమౌళితో చెప్పిందట. దీంతో తమన్నా గ్రేట్ అంటూ జక్కన్న కితాబిచ్చాడట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments