Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ చేతికి గాయం... నిద్రపోని రాజమౌళి... షూటింగ్‌కి జూనియర్...

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (21:26 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఏదైనా సినిమాను ప్రారంభిస్తే ఆ సినిమా పూర్తయ్యేంత వరకు సరిగ్గా నిద్రపోరని తెలుగు సినీవర్గాలు చెబుతున్నాయి. ఒక మంచి కథను ఎంపిక చేసుకుని నటీనటులందరినీ సెలక్ట్ చేసుకుని సినిమాను పూర్తి చేయడం రాజమౌళికి బాగా తెలుసు. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సినిమాలను పూర్తి చేశాడు రాజమౌళి. కానీ ఆర్.ఆర్.ఆర్. సినిమాకు మాత్రం అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి.
 
మొదట్లో హీరో రాంచరణ్ జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ గాయపడ్డారు. దీంతో కొన్నిరోజుల పాటు షూటింగ్ ఆగిపోయింది. ఆ తరువాత షూటింగ్ తిరిగి ప్రారంభమైతే జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించేందుకు ఎంపిక చేసుకున్న విదేశీ హీరోయిన్ తాను నటించనని వెళ్ళిపోయింది. ఇక మూడవది జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయం. జూనియర్ ఎన్టీఆర్ కుడి చేతికి గాయమైంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ రెండురోజులుగా రెస్ట్‌లో ఉన్నాడట. 
 
కానీ తనకు దెబ్బ తగిలినా కూడా షూటింగ్ మాత్రం ఆపేది లేదని కొనసాగిస్తున్నాడట. ఇలా రాజమౌళి సినిమాకు అడుగడుగునా అడ్డంకులు రావడం సినిమా యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. కానీ రాజమౌళి మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎప్పట్లానే రెట్టించిన ఉత్సాహంతో నిద్రపోకుండా సినిమా కోసం కృషి చేస్తున్నారట. మొత్తమ్మీద అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేయాలని గట్టిగా అందరూ పనిచేస్తున్నారు. దటీజ్ ఆర్ఆర్ఆర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ మహా సభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి : కేంద్ర మంత్రి పెమ్మసాని

సింధు జలాలను నిలుపుతూ భారత్ చేపట్టే నిర్మాణాలను పేల్చేస్తాం : పాక్ మంత్రి వార్నింగ్!!

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments