Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి దయతో మళ్ళీ పుంజుకున్న వైద్యుడు... ఎవరు..? (Video)

పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నటించి "గరుడవేగ" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో డాక్టర్ రాజశేఖర్. ఎంతో అద్భుతంగా చిత్రీకరించిన గరుడవేగ రిలీజ్‌కు ముందు మూవీ ప్రమోషన్స్ కోసం చాలా శ్రమించ

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2017 (15:41 IST)
పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నటించి "గరుడవేగ" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో డాక్టర్ రాజశేఖర్. ఎంతో అద్భుతంగా చిత్రీకరించిన గరుడవేగ రిలీజ్‌కు ముందు మూవీ ప్రమోషన్స్ కోసం చాలా శ్రమించారు రాజశేఖర్ దంపతులు. హీరోతో పాటు దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్ కూడా సామాజిక మాధ్యమాలకు ఇంటర్వ్యూలు ఇచ్చి గరుడవేగ సినిమాపై అంచనాలను పెంచారు.
 
మంచి సినిమా తీశానన్న ఆనందంలో రాజశేఖర్ ఉన్నా కొన్ని ఇబ్బందులు మాత్రం ఆయనకు తప్పలేదు. సినిమా షూటింగ్ సమయంలో తన తల్లి మరణించడం, ఆ తర్వాత తన కారు ప్రమాదానికి గురికావడం, చిత్రం విడుదలకు ముందు తన భార్య జీవిత సోదరుడు మరణించడం రాజశేఖర్ జీర్ణించుకోలేకపోయారు.
 
సినిమా రిలీజ్‌కు ముందు ఒక ఆవేశపూరితమైన ప్రసంగం కూడా రాజశేఖర్ చేశారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సినిమాను తీశాం. ఈ సినిమాను థియేటర్లలో మాత్రమే చూడాలి. అప్పుడే మీకు థ్రిల్లింగ్ కలుగుతుందని విజ్ఞప్తి చేశారు. 
 
ఇదంతా ఒక ఎత్తయితే మరో ప్రధానమైంది రాజశేఖర్, జీవితలు మెగాస్టార్ చిరంజీవిని కలవడం. నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి సినిమా మొదటి రోజు మొదటి షోను మీరు చూడాలని రాజశేఖర్ కోరడంతో చిరు సినిమాను చూశారు. చిరును కలిసిన తర్వాత రాజశేఖర్ ఒక ప్రకటన కూడా చేశారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేము కలిసే ఉన్నాం అని చెప్పగానే మెగా అభిమానుల్లో రాజశేఖర్‌పై ప్రత్యేక అభిమానం ఏర్పడింది. 
 
మొత్తం సినిమాకు రూ.25 నుంచి రూ.30 కోట్లు రూపాయలు ఖర్చు కాగా మొదటిరోజు 6 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల రూపాయలు మొదటిరోజే వచ్చింది. స్టార్ హీరోలతో సమానంగా రాజశేఖర్ మొదటిరోజు కలెక్షన్లతోనే కోట్ల రూపాయలు సంపాదించాడు. అయితే సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్ రావడానికి చిరంజీవే ప్రధాన కారణమంటున్నారు మెగాస్టార్ అభిమానులు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments