Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్నటి వరకు 'పవర్ స్టార్' .. నేడు 'అల్లు అరవింద్' : వర్మ టార్గెట్

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2020 (13:18 IST)
తెలుగు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు అస్సలు మెగాస్టార్ ఫ్యామిలీ అన్నా, ఆయన కుటుంబ సభ్యులన్నా ఎక్కడలేని కోమని తెలుస్తోంది. అందుకే నిన్నామొన్నటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఏకంగా సినిమానే తీశారు. ఇపుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను టార్గెట్ చేసుకున్నారు. అరవింద్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. 
 
ఇందులోభాగంగా, తన త‌దుప‌రి చిత్రం 'అల్లు' అని ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించాడు ఆర్జీవీ. 'తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటర్జీతో ప్లాన్‌ల అల్లుడులో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి 'అల్లు'డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడు. 
 
అందరితో తనని 'ఆహా' అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ ‘అల్లు' అంటూ వ‌ర్మ తెలిపారు. ఈ చిత్రంలో ఆర‌వింద్‌, చిర్రంజీవి, ప్ర‌వ‌న్ క‌ల్యాణ్‌, ఆర్జున్‌, శీరీష్‌, కె.ఆర్‌.చ‌ర‌ణ్‌, ఎన్‌.బీబు త‌దిత‌ర పాత్ర‌లుంటాయ‌ని కూడా వ‌ర్మ తెలిపారు. 
 
కాగా, మెగాస్టార్ చిరంజీవి బావమ‌రిది అయిన అల్లు అర‌వింద్‌ను ఆర్జీవీ టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తుంది. కానీ వ‌ర్మ ఈసారి కూడా తెలివిగా నేరుగా ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. మ‌రి ఈ సినిమా ఎన్ని వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతుందో చూడాలి. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ "ఆర్జీవీ మిస్సింగ్" అనే చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments