Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాథేశ్యామ్ ఒక్క ఫైట్‌కి రూ. 2 కోట్లా?

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (19:19 IST)
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా రాథేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. ఇది పిరియాడిక్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఇటలీలో ఈ క్రేజీ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.
 
పూజా హేగ్డే తన క్యారక్టర్‌కు సంబంధించి ఇటలీలో షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. త్వరలోనే మిగిలిన టీమ్ హైదరాబాద్ చేరుకోనున్నారు. 
 
 ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఇది లవ్ స్టోరీ. ఇందులో ఒకే ఒక్క ఫైట్ ఉంది. దీనిలో యాక్షన్ సీన్‌కు పెద్దగా ప్రాముఖ్యత లేదు. అయితే.. రాధేశ్యామ్ యూనిట్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తమ సినిమాలో ఉన్న ఒకే ఒక్క ఫైట్ కోసం అక్షరాలా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధపడుతోందని సమాచారం.
 
అవును.. రాధేశ్యామ్ సినిమాలో కేవలం ఒకే ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పోవెల్‌ను ఈ యాక్షన్ సీన్స్ కోసం రంగంలోకి దించారు. గతంలో ఇతడు గ్లాడియేటర్, బార్న్ ఐడెంటిటీ సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేశారు. సాహో సినిమాలో కేవలం యాక్షన్ సీన్స్‌కే 50 కోట్ల రూపాయల వరకు ఖర్చుచేశారు. అది యాక్షన్ మూవీ. అయితే.. లవ్ స్టోరీలో ఉన్న ఒకే ఒక్క ఫైట్ కు 2 కోట్లు ఖర్చు చేస్తుండడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

యజమానిని చంపేసిన పెంపుడు కుక్క... ఎక్కడ?

Mahanadu: కడపలో టీడీపీ మహానాడు.. శరవేగంగా ఏర్పాట్లు.. పసందైన వంటకాలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments