Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్లపై కూడా భళ్లాలదేవ ప్రభావం.. విలనీ పండించడానికి శ్రియ తయార్

బాహుబలిలో ప్రతినాయక పాత్రలో నటించడానికి రానా ఏ ముహూర్తంలో ఒప్పుకున్నాడో కానీ ఇప్పుడు ఉన్నట్లుండి భారతీయ చిత్రరంగంలో విలన్ పాత్రకు పిచ్చ క్రేజి వచ్చేసింది. జగపతి బాబు హీరో బాట వదిలి సెకెండ్ ఇన్నింగ్స్ చేపట్టి లెజెండ్ సినిమాలో విలన్‌గా మారగానే టాలీవుడ్

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (03:26 IST)
బాహుబలిలో ప్రతినాయక పాత్రలో నటించడానికి రానా ఏ ముహూర్తంలో ఒప్పుకున్నాడో కానీ ఇప్పుడు ఉన్నట్లుండి భారతీయ చిత్రరంగంలో విలన్ పాత్రకు పిచ్చ క్రేజి వచ్చేసింది. జగపతి బాబు హీరో బాట వదిలి సెకెండ్ ఇన్నింగ్స్ చేపట్టి లెజెండ్ సినిమాలో విలన్‌గా మారగానే టాలీవుడ్ బ్రహ్మరథం పట్టింది. దీంతో విలనీ పాత్రలకు ఉన్న స్కోప్ అర్థమై కుర్రహీరోలకు కూడా విలన్ పాత్రలపై మక్కువ పెరిగింది. అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 2.0లో ఫక్తు విలన్‌గా నటించడంతో ఆ చిత్రం రేంజ్ ఎక్కడికో పోయింది. 
 
ఇప్పుడు హీరోయిన్లకు కూడా విలన్ పాత్ర నచ్చేస్తున్నట్లుంది. శాతకర్ణి సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రియ కాగా తాజాగా ప్రతినాయకిగా మారడానికి ఏ మాత్రం సంకోచించకుండా నరకాసురన్‌ అనే చిత్రంలో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. నరకాసురన్‌కు నటి శ్రియ విలన్‌గా మారనుందా ఈ ప్రశ్నకు కోలీవుడ్‌లో అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే కోలీవుడ్‌లో శింబుతో ‘అన్బానవన్‌ అసరాధవన్‌ అడంగాధవన్‌’ చిత్రంలో రొమాన్స్‌ చేస్తోంది. 
 
ఇటీవల చిన్న చిత్రంగా విడుదలై చాలా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం దృవంగళ్‌ పదునారు. దీనికి సృష్టికర్త నవ దర్శకుడు కార్తీక్‌నరేన్‌. తొలి చిత్రంతోనే శభాష్‌ అనిపించుకున్న ఈ వర్ధమాన దర్శకుడు తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం పేరే నరకాసురన్‌. ఇందులో అరవిందస్వామి ప్రధాన పాత్ర పోషించనున్నారు. యువ కథానాయకుడిగా టాలీవుడ్‌ యువ నటుడు నాగచైతన్య నటించడానికి అంగీకరించినా, ఇప్పుడు ఆయన వైదొలగినట్లు టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. కారణం ఆయన త్వరలో తన ప్రేయసి సమంతను వివాహమాడబోతుండడమేనని సమాచారం. 
 
నాగచైతన్య పాత్రలో మరో టాలీవుడ్‌ నటుడి కోసం వేట మొదలైందని తెలుస్తోంది. ఇందులో ప్రతినాయకిగా శ్రియ నటించనున్నారట. కథ వినగానే తన పాత్ర తెగ నచ్చేయడంతో విలనీయం ప్రదర్శించడానికి శ్రియ సిద్ధం అనేసిందట. మరో విషయం ఏమిటంటే ఆ చిత్ర కథ నచ్చడంతో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్‌ తానే నిర్మించడానికి ముందుకు వచ్చారట. చిత్ర షూటింగ్‌ ఆగస్ట్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే చిత్ర దర్శకుడు కార్తీక్‌నరేన్‌ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకోనున్నారని తెలిసింది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments