Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్‌లో రోజాపైనే సెటైర్లు... లేచెళ్లిపోయిందట...

జబర్దస్త్‌ అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది రోజానే. ఆ తరువాత నాగబాబు. ఇక మిగిలిన కమెడియన్లు. పంచ్ డైలాగులతో అందరినీ కడుపుబ్బ నవ్వించే జబర్దస్త్‌ను బాగా ఆదరిస్తున్నారు తెలుగు ప్రజలు. రోజాకు తిరిగి స్టార్‌డమ్ రావడానికి, ఆమెను అందరూ గుర్తించడానికి కారణం జ

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (20:46 IST)
జబర్దస్త్‌ అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది రోజానే. ఆ తరువాత నాగబాబు. ఇక మిగిలిన కమెడియన్లు. పంచ్ డైలాగులతో అందరినీ కడుపుబ్బ నవ్వించే జబర్దస్త్‌ను బాగా ఆదరిస్తున్నారు తెలుగు ప్రజలు. రోజాకు తిరిగి స్టార్‌డమ్ రావడానికి, ఆమెను అందరూ గుర్తించడానికి కారణం జబర్దస్తే. అయితే అలాంటి జబర్దస్త్‌తో సాఫీగా సాగిపోతున్న రోజాకు లేవలేని దెబ్బ తగిలినట్లు సమాచారం. 
 
నిన్న జబర్దస్త్‌ షూటింగ్‌లో రోజా, నాగబాబులపై సెటైర్లు వేస్తూ కమెడియన్లు స్కిట్లు చేశారట. అందులో రోజా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా ఉనట్లు సమాచారం. దీంతో రోజా మొదట్లో అభ్యంతరం తెలిపారట. కానీ నిర్వాహకులు మాత్రం ఏమీ కాదు.. రికార్డు కానివ్వండంటూ రోజాను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇంతలో ఆ డైలాగులు కాస్తా రోజా మనస్సుకు ఇబ్బందులు కలిగించేవిగా ఉండటంతో ఇక ఆపులేకపోయారట. చెడామడా కమెడియన్లను తిట్టేశారట. నిర్వాహకుల పైన కూడా మండిపడ్డారట. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కాకూడదంటూ అందరినీ హెచ్చరించినట్లు తెలిసింది. జబర్దస్త్‌లో ఇదే నా లాస్ట్ ఎపిసోడ్ అంటూ అక్కడి నుంచి రోజా వెళ్ళిపోయినట్లు కూడా చెప్పుకుంటున్నారు. అయితే రోజా లేకుంటే జబర్దస్త్‌ వీక్ అనేది అందరికీ తెలిసిందే. దీంతో నిర్వాహకులు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారట. ఈరోజు షూటింగ్‌కు రోజా వెళ్ళనేలేదట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments