Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోగా ఉన్నా రజినీకాంత్‌కు మాత్రం ఆ కోరిక చావడంలేదట...

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కోరిక ఉంటుంది. కొంతమందికి అది నెరవేరుదు. మరికొంతమందికి నెరవేరుతుంది. కోరిక నెరవేరని వారు మాత్రం ఏదో ఒకవిధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులోను ప్రముఖులైతే చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ అదే చేస్తున్నారు. తనకు తీరని క

Webdunia
గురువారం, 13 జులై 2017 (14:40 IST)
ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కోరిక ఉంటుంది. కొంతమందికి అది నెరవేరుదు. మరికొంతమందికి నెరవేరుతుంది. కోరిక నెరవేరని వారు మాత్రం ఏదో ఒకవిధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులోను ప్రముఖులైతే చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ అదే చేస్తున్నారు. తనకు తీరని కోరిక ఒకటి ఉందట. ఆ కోరిక తీర్చుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే చాలామందికి నవ్వొస్తుంది. 
 
నిజం. రజినీకాంత్‌కు పోలీస్ అవ్వాలన్న ఆశ ఎప్పటి నుంచో ఉందట. ఆ ఆశను నెరవేర్చుకునేందుకు మొదట్లో ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. కండెక్టర్‌గా చేరాడు. అయితే ఆ వృత్తిలో నుంచి హీరో అయ్యి ఆ తరువాత రేంజ్ మారి దక్షిణాది సూపర్ స్టార్ అయ్యారు. హీరోగా ఉన్నా రజినీకాంత్‌కు మాత్రం ఆ కోరిక చావడంలేదట. దీంతో ప్రతిరోజు పోలీస్ డ్రస్ వేసుకుని అద్దంలో చూసుకున్న తరువాత రజినీ బయటకు వచ్చి షూటింగ్‌కు వెళతారట.
 
ప్రతిరోజు రజినీ ఇలాగే చేస్తారట. ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. కానీ ఎవ్వరు ఆయన్ను తప్పుబట్టరు. రజినీ అంటే కుటుంబంలో అందరికీ గౌరవమే. మొదట్లో రజినీ పోలీస్ డ్రెస్ వేసుకుని అద్దంలో చూసుకుంటే నవ్వుకున్న కుటుంబ సభ్యులు ఆ తరువాత రజినీకి పోలీస్ అవ్వాలన్న కోరికను చూసి అస్సలేమీ మాట్లాడలేదట. రెండు, మూడురోజులకు ఒకసారి పోలీస్ డ్రెస్‌ను వాష్ చేసి ఐరన్ చేసి రజినీకి బీరువాలో అందుబాటులో పెడతారట. వినడానికి విచిత్రంగానే ఉన్నా ఇది నిజమంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments