Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ సరసన సిమ్రాన్.. త్రిషకు ఛాన్స్ లేనట్టేనా? ఐపీఎల్ ఫైనల్లో?

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా పా రంజిత్ 'కాలా' సినిమా చేశాడు. ధనుష్ నిర్మించిన ఈ సినిమాలో రజనీ సరసన హుమా ఖురేషి నటించింది. 'కబాలి'లో రజనీకాంత్‌ను కొత్తగా చూపించి మంచి మార్కులు కొట్టేసిన పా రంజిత

Webdunia
బుధవారం, 23 మే 2018 (14:09 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా పా రంజిత్ 'కాలా' సినిమా చేశాడు. ధనుష్ నిర్మించిన ఈ సినిమాలో రజనీ సరసన హుమా ఖురేషి నటించింది. 'కబాలి'లో రజనీకాంత్‌ను కొత్తగా చూపించి మంచి మార్కులు కొట్టేసిన పా రంజిత్, ఈ సినిమాలోనూ రజనీకాంత్‌ను కొత్త లుక్‌లో చూపిస్తున్నాడు.


ఈ సినిమా సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు అండ్ ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. వచ్చేనెల 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
 
ఇదిలా ఉంటే.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా కార్తిక్ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. ఈ చిత్రంలో తొలిసారిగా రజనీకాంత్‌కు ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ నటిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో రజనీ సరసన తొలుత రజనీకి జోడీగా త్రిష, మీన నటిస్తారని వార్తలు వచ్చాయి.
 
కానీ చిత్రబృందం సిమ్రాన్‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో కొన్నేళ్ల పాటు అగ్ర కథానాయికగా కొనసాగిన సిమ్రన్‌ తైలవాతో కలిసి నటించబోతుండడం ఇదే తొలిసారి కావడం విశేషం. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రలో విజయ్‌ సేతుపతి విలన్‌ పాత్రలో నటిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. రజనీకాంత్ అభిమానులు, రోబో సినిమా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ రోబో. రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మే 27న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఐపీఎల్-11 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విడుదల చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సిఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments