Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమైన ఆపద్బాంధవుడు : సోనూ సూద్ ఆస్తుల విలువ ఎంత?

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (11:27 IST)
బాలీవుడ్ నటుడు సోనూ సూద్. గత కొన్ని రోజులుగా దేశ మీడియా రంగంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు. పేరుకు నటుడు. అందులోనూ పక్కా విలన్. కానీ, నిజ జీవితంలో మాత్రం ఆయన ఓ రియల్ హీరోగా మారిపోయారు. ప్రధానంగా కరోనా కష్టకాలంలో నేనున్నానంటూ పేదలకు, వలస కార్మికులకు అండగా నిలిచాడు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ ఆస్తి గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. 
 
కోట్లాది రూపాయలు వెనుకేసుకుని కూర్చొన్న బడా పారిశ్రామికవేత్తలు, స్టార్ హీరోల కంటే... తనకు ఉన్నదాంట్లో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్న సోనూ సూద్‌ను ప్రతి ఒక్కరూ శభాష్ అంటూ అభినందిస్తున్నారు. ఈ క్రమంలో సోనూ సూద్ మొత్తం ఆస్తి విలువ ఎంత అనే చర్చ ముమ్మరంగా సాగుతోంది. 
 
సోనూ సూద్ ఆస్తి గురించి ఓ బాలీవుడ్ మీడియా కథనం వెలువరించింది. సోనూ సూద్ ఆస్తుల విలువ గురించి చూచాయగా వెల్లడించింది. సోనూ సూద్ దాదాపు 20 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడిగా వెలుగొందుతున్నాడు. బాలీవుడ్‌తోపాటు తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నాడు. ఇన్ని సంవత్సరాలలో సంపాదించిన డబ్బుతో సోనూ హోటల్ బిజినెస్ ప్రారంభించాడట.
 
ముంబైతోపాటు మరికొన్ని ప్రధాన నగరాల్లో హోటళ్లు తెరిచాడట. సోనూ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.130 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఈ కరోనా సమయంలో వివిధ సహాయాల కోసం దాదాపు రూ.10 కోట్ల వరకూ సోనూ ఖర్చు పెట్టి ఉంటాడట. రూ.వేల కోట్ల ఆస్తులు కలిగిన స్టార్ హీరోలతో పోలిస్తే తనకున్న దాంట్లోనే సహాయం కోసం వెచ్చిస్తున్న సోనూ మంచి మనసును అందరూ ప్రశంసిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments