Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి కాపీ కొట్ట‌మంటే కాపీ కొట్టా... సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన త‌మ‌న్... ఏం జ‌రిగింది?

టాలీవుడ్‌లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌లో త‌మ‌న్ ఒక‌రు. ఇటీవ‌ల మెగా హీరో వ‌రుణ్ తేజ్ న‌టించిన తొలిప్రేమ చిత్రానికి సూప‌ర్ మ్యూజిక్ అందించి ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (10:23 IST)
టాలీవుడ్‌లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌లో త‌మ‌న్ ఒక‌రు. ఇటీవ‌ల మెగా హీరో వ‌రుణ్ తేజ్ న‌టించిన తొలిప్రేమ చిత్రానికి సూప‌ర్ మ్యూజిక్ అందించి ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. దీంతో వ‌రుస‌గా భారీ ప్రాజెక్ట్స్‌కి మ్యూజిక్ చేసే అవ‌కాశం ద‌క్కించుకున్నారు. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న అర‌వింద స‌మేత చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
 
ఇదిలాఉంటే.. త‌మ‌న్‌కి ఇండ‌స్ట్రీలో కాపీ మాస్ట‌ర్ అనే పేరుంది. కాపీ బాగా కొడ‌తాడ‌ని.. అలాగే త‌ను గ‌త చిత్రాల‌కు అందించిన మ్యూజిక్‌నే కొత్త‌గా ఇచ్చేంద‌ుకు ప్ర‌య‌త్నిస్తుంటాడ‌ని టాక్. అయితే... ఓ న్యూస్ పేప‌ర్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కాపీ గురించి త‌మ‌న్‌ని అడిగితే.. ఊహించ‌ని స‌మాధానంతో స‌ర్‌ఫ్రైజ్, షాకింగ్ ఆన్స‌ర్ చెప్పాడు. 
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే... కాపీ మాస్ట‌ర్ అనే పేరుంది మీరేమంటారు అని అడిగితే.. డైరెక్ట‌ర్స్ ఫ‌లానా పాట‌ లాంటిది కావాలంటారు. అందుచేత వాళ్లు చెప్పిన‌ట్టే పాట అందిస్తాం. బిజినెస్ మ్యాన్ సినిమాలో పిల్లా చావ్.. అనే పాట‌ను పూరి కాపీ కొట్ట‌మంటేనే కొట్టాను... అంటూ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టాడు. అంతే త‌ప్పా... నేను కావాల‌ని కాపీ ట్యూన్స్ ఇవ్వ‌ను అంటూ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు. అదీ సంగ‌తి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments