Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" సినిమాలో విలన్ ఇతడేనా?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల రీఎంట్రీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన "ఖైదీ నెం.150" చిరు సినిమాలల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక తదుపరి చిత్రం "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి"పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అందు

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (17:39 IST)
మెగాస్టార్ చిరంజీవి సినిమాల రీఎంట్రీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన "ఖైదీ నెం.150" చిరు సినిమాలల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక తదుపరి చిత్రం "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి"పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అందులో చిరు స్వాతంత్య్ర సమరయోధుడిలా నటించనున్నాడు. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక కూడా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. 
 
తాజాగా హీరోకి పోటాపోటీగా నటించగల మరో హీరోని విలన్‌గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అతడు మరెవరో కాదు, 2012 సంవత్సరంలో వచ్చిన "ఈగ" సినిమాలో తన విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ నటుడు "సుదీప్". బాహుబలి-ది బిగినింగ్ సినిమాలోనూ ఇతడు కనిపించాడు. 
 
ఇక ఇప్పుడు చిరుకి ప్రత్యర్థిగా నటిస్తున్నాడంటే, సినిమాపై అంచనాలను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోపక్క బిగ్‌బీ అమితాబ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలై, రిలీజు ఎప్పుడు అవుతుందోనని అభిమానులు నిరీక్షిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments