Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యతో రొమాన్స్ చేయనున్న మలయాళ కుట్టి కీర్తి సురేష్...

''నేను శైల‌జ'' చిత్రంతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఈ చిత్రం త‌రువాత అమ్మ‌డు తెలుగులో మ‌రే చిత్రాన్ని ఒప్పుకోలేదు..కానీ త‌మిళంలో అమ్మ‌డు ఫుల్ బిజీ అయిపోయింది. తాజాగా ఈ భామ సూర్యతో

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (16:54 IST)
''నేను శైల‌జ'' చిత్రంతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఈ చిత్రం త‌రువాత అమ్మ‌డు తెలుగులో మ‌రే చిత్రాన్ని ఒప్పుకోలేదు..కానీ త‌మిళంలో అమ్మ‌డు ఫుల్ బిజీ అయిపోయింది. తాజాగా ఈ భామ సూర్యతో నటించేందుకు రెడీ అవుతోంది. శివ కార్తీకేయన్‌తో ఓ సినిమాలో నటించి కోలీవుడ్‌ను షేక్ చేసిన కీర్తి సురేష్ ప్రస్తుతం విజయ్‌ సరసన నటిస్తోంది.
 
ప్రస్తుతం సెట్‌పై ఉన్న "ఎంగ వీట్టుపిళ్లై" చిత్రంలో నటనకు ప్రాధాన్యత వున్న పాత్రలో నటిస్తోంది. దీంతో సహజంగానే ఆమె క్రేజ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో 24 హీరో సూర్యతో నటించే ఛాన్స్ కొట్టేసింది. "కొంబన్" ఫేమ్‌ ముత్తయ్య దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రంలో సూర్య సరసన కీర్తి సురేష్‌ ఎంపికైంది. కాగా గతంలో సూర్య తన ఫేవరేట్ హీరో అని ఇంటర్వ్యూలో చెప్పిన కీర్తి సురేష్ ప్రస్తుతం ఆయన సరసన నటించే ఛాన్స్ రావడంతో ఎగరి గంతేసింది.
 
 సూర్య ప్రస్తుతం సింగం3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తుండగా, అనుష్క, శ్రుతిహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక సూర్య, కీర్తి సురేష్‌ల కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments