Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది బాహుబలి దెబ్బేనా? తమన్నా క్రేజ్ 50 ఏళ్ల హీరో స్థాయికి పడిపోయిందేమిటి?

తమన్నా అంటే పచ్చబొట్టు... నచ్చానా... అంటూ బాహుబలి బిగినింగ్ చిత్రంలోని పాటల్లో ఆమె చూపించిన అందాలు గుర్తుకు వస్తాయి. అలాంటిది బాహుబలి 2లో దేవసేన అనుష్క దెబ్బకు ఫేడ్ అయిపోయినట్లు అనిపిస్తోంది. బాహుబలి

Webdunia
బుధవారం, 10 మే 2017 (16:58 IST)
తమన్నా అంటే పచ్చబొట్టు... నచ్చానా... అంటూ బాహుబలి బిగినింగ్ చిత్రంలోని పాటల్లో ఆమె చూపించిన అందాలు గుర్తుకు వస్తాయి. అలాంటిది బాహుబలి 2లో దేవసేన అనుష్క దెబ్బకు ఫేడ్ అయిపోయినట్లు అనిపిస్తోంది. బాహుబలి చిత్రంలో నటించినవారు అవకాశాలతో దూసుకువెళుతుంటే అవంతిక పాత్రలో అందాలు ఆరబోసిన తమన్నాకు మాత్రం మొండిచేయే మిగులుతోందంటున్నారు. 
 
బాహుబలి కంక్లూజన్ చిత్రంలో తమన్నాకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఏదో మిణుకుమిణుకుమంటూ చుక్కలా కనిపించింది. అనుష్కకు వచ్చిన క్రేజ్ ఆమెకు లేకుండా పోయింది. ఇదిలావుంటే తమన్నాకు వచ్చిన అవకాశాలు వచ్చినట్లే చేజారుతున్నాయట. జూనియర్ ఎన్టీఆర్ లవకుశ చిత్రంలో తమన్నా నటిస్తోందని చెప్పుకున్నారు కానీ, ఆ తర్వాత రాశి ఖన్నా నటిస్తున్నట్లు తెలిసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంలో తమన్నాను తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. 
 
కానీ యూనిట్ మాత్రం అబ్బే... అదేం లేదని ఖండించింది. ఏతావాతా చూస్తే 50 ఏళ్ల తమిళ నటుడు విక్రమ్ తో నటిస్తున్న ఒక్క సినిమా మాత్రమే ప్రస్తుతం తమన్నా చేతిలో వున్నదట. అంతకుమించి మరేమీ లేవని అంటున్నారు. ఇదేమైనా బాహుబలి కంక్లూజన్ దెబ్బేమో అని అనుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments