Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వృద్ధుడితో నేను నటించనంటున్న మిల్కీ బ్యూటీ

బాహుబలి భారీ విజయం తరువాత తమన్నాకు కాస్త పొగరు బాగానే పెరిగిందని తెలుగు సినీవర్గాలు బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి. అప్పుడెప్పుడు హ్యాపీ డేస్ సినిమాలో కనిపించి శేఖర్ కమ్ముల లాంటి అగ్ర దర్సకులతో తన కెరీర్ నుంచి ప్రారంభించి ఆ తరువాత తిరిగి చూడలేదు తమన్న

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (12:06 IST)
బాహుబలి భారీ విజయం తరువాత తమన్నాకు కాస్త పొగరు బాగానే పెరిగిందని తెలుగు సినీవర్గాలు బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి. అప్పుడెప్పుడు హ్యాపీ డేస్ సినిమాలో కనిపించి శేఖర్ కమ్ముల లాంటి అగ్ర దర్సకులతో తన కెరీర్ నుంచి ప్రారంభించి ఆ తరువాత తిరిగి చూడలేదు తమన్నా. 
 
అవకాశాలు అటు తమిళం, ఇటు తెలుగులో వస్తూనే ఉన్నాయి. దర్సకుడు రాజమౌళి సినిమా బాహుబలి కూడా తమన్నాకు మంచి పేరును తెచ్చి పెట్టింది. అగ్ర హీరోయిన్ అయిన తరువాత తమన్నా కాస్త టెక్కువైందని సినీవర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.
 
తమన్నా కూడా అదే చేస్తోందంటున్నారు. తెలుగు సినిమాల్లో అగ్రహీరోల్లో ఒకరైన వెంకటేష్‌తో దర్శకుడు తేజ సినిమా తీసేందుకు సిద్థమయ్యారు. ఆ సినిమాలో హీరోయిన్‌గా తమన్నాను అనుకుని ఆమెను సంప్రదించారట. అయితే తమన్నా హీరో వెంకటేష్ పేరు చెప్పగానే తనకు ఖాళీ లేదని, ప్రస్తుతం బిజీగా ఉన్నానని చెప్పేసిందట. 
 
అయితే తమన్నా ప్రస్తుతం ఏ సినిమాలోను నటించడం లేదు. ఆమె ఖాళీగానే ఉంది. వయస్సు పైబడిన హీరోలతో నటిస్తే కెరీర్ దెబ్బతింటుందనేది తమన్నా ఆలోచన. అందుకే ఇలా చెప్పిందట. దర్శకుడు తేజ ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదట. దాంతో చేసేది లేక కాజల్ అగర్వాల్ ను ఓకే చేశాడట

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments