Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ తినే ఆహారమే వాళ్లింట్లో బాయ్‌కి కూడా పెడతారు : మెగా హీరో

పూరీ జగన్నాథ్... హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్‌తో ఇపుడు మార్మోగిపోతోంది. ఈ స్కామ్‌తో అతనికి గల సంబంధాలపై నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ పోలీసులు బుధవారం నుంచి విచారణ చేపట్టారు. అసలు డ్రగ్స్ స్కామ్‌

Webdunia
బుధవారం, 19 జులై 2017 (15:27 IST)
పూరీ జగన్నాథ్... హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్‌తో ఇపుడు మార్మోగిపోతోంది. ఈ స్కామ్‌తో అతనికి గల సంబంధాలపై నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ పోలీసులు బుధవారం నుంచి విచారణ చేపట్టారు. అసలు డ్రగ్స్ స్కామ్‌లో పూరీ జగన్నాథ్ పేరు వెల్లడికావడం ఓ సంచలనంగా మారింది. 
 
దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా స్పందించారు. డ్రగ్స్ వ్యవహరంలో నోటీసులు అందుకున్నవారంతా సిట్ విచారణకు హాజరు కావాల్సిందేనని, చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నాడు. డ్రగ్స్ తీసుకోవడం మంచిది కాదని... మెరుగైన ఆరోగ్యం కంటే ఏదీ గొప్పది కాదన్నారు. 
 
ఇకపోతే పూరీ జగన్నాథ్ గురించి మాట్లాడుతూ, ఆయన చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చాడు. ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారని... పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉంటారని తెలిపారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడే స్వభావం కూడా ఆయనకు లేదన్నారు. పక్కవాళ్లను జగన్ చాలా మంచిగా చూసుకుంటాడని... ఆయన ఏం ఆహారం తీసుకుంటే, వాళ్లింట్లోని బాయ్‌కు కూడా అదే ఆహారం పెడతారని చెప్పాడు. ఆయన పేరు డ్రగ్స్ వ్యవహారంలో బయటకు రావడంతో తాను షాక్‌కు గురైనట్టు వరుణ్ తేజ్ చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

ఆ పాట పెళ్లిని ఆపేసింది.. మాజీ ప్రియురాలు గుర్తుకొచ్చి.. పెళ్లి వద్దనుకున్న వరుడు?

Washington: ఆ కుటుంబానికి ఏమైంది..? టెక్కీ కింగ్ అయినా భార్యను, కుమారుడి కాల్చేశాడు.. తర్వాత?

ఏపీలో వైకాపా లిక్కర్ స్కామ్-రూ.3,200 కోట్ల భారీ మోసం.. సిట్ వెల్లడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments