Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా హీరోతో మూవీ ప్లాన్ చేస్తోన్న నాగశౌర్య డైరెక్ట‌ర్..!

మెగా హీరోతో మూవీ ప్లాన్ చేస్తోన్న నాగ శౌర్య డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల‌. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్‌‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఛలో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని మంచి విజ‌యం సాధించింది. నాగశౌర్య స్వయంగా

Webdunia
బుధవారం, 23 మే 2018 (22:28 IST)
మెగా హీరోతో మూవీ ప్లాన్ చేస్తోన్న నాగ శౌర్య డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల‌. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్‌‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఛలో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని మంచి విజ‌యం సాధించింది. నాగశౌర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ఘనవిజయం సాధించటంతో బడా నిర్మాణ సంస్థల దృష్టిలో పడ్డాడు వెంకీ.
 
తాజాగా ఈ యువ దర్శకుడు మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌తో మూవీ ప్లాన్ చేస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం కరుణాకరన్‌ దర్శకత‍్వంలో తేజ్‌ ఐ లవ్‌ యు సినిమా చేస్తున్నాడు. సాయి ధరమ్‌ తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంతవరకు ప్రకటించలేదు. కిశోర్‌ తిరుమల, చంద్రశేఖర్‌ ఏలేటి, గోపిచంద్‌ మలినేని దర్శకులతో చర్చలు జరగుతున్నట్టుగా తెలుస్తోంది. 
 
తాజాగా ఈ లిస్ట్‌లో వెంకీ కుడుమల కూడా చేరాడు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాను గీతా ఆర్ట్స్‌లో తెరకెక్కించనున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ట‌. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాల‌ను అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments