Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ బాబు మూవీలో విజ‌య‌శాంతి... ఈ వార్త నిజ‌మేనా..?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (17:33 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు -స‌క్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం మ‌హ‌ర్షి. ఈ సినిమా ప్ర‌స్తుతం చెన్నైలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. మే 9న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్టు నిర్మాత దిల్ రాజు ఇటీవ‌ల అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. 
 
ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్.. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ భారీ చిత్రాన్ని దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో అనిల్ సుంక‌ర నిర్మించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. జూన్ నెలలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకునివెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
ఈ మూవీలో లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి న‌టించ‌నున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 2006లో నాయుడ‌మ్మ సినిమా త‌ర్వాత విజ‌య‌శాంతి సినిమాల్లో న‌టించ‌లేదు. అయితే... ఇటీవ‌ల అనిల్ రావిపూడి విజ‌య‌శాంతికి క‌థ చెప్పార‌ని... ఇందులో ఆమె పాత్ర న‌చ్చి ఓకే చెప్పార‌ని టాక్ వినిపిస్తోంది. 
 
గ‌తంలో మ‌హేష్, విజ‌య‌శాంతి క‌లిసి కొడుకుదిద్దిన కాపురం చిత్రంలో న‌టించారు. ఈ సినిమాలో విజ‌య‌శాంతి, మ‌హేష్ త‌ల్లీకొడుకులుగా న‌టించారు. మ‌రి..అనిల్ రావిపూడితో చేయ‌నున్న సినిమాలో కూడా విజ‌య‌శాంతి త‌ల్లి పాత్ర పోషించ‌నుందా..? లేక వేరే ప‌వ‌ర్‌ఫుల్ రోల్ చేయ‌నున్నారా..? అస‌లు ప్ర‌చారంలో ఉన్న ఈ వార్తలో వాస్త‌వం ఉందా..? లేదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments