Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజ్ఞాతవాసిలో అదరగొట్టనున్న వెంకటేష్.. పవన్‌తో ఫైట్ సీన్?

అజ్ఞాతవాసి సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ పాడిన పాట కొత్త సంవత్సరం కానుకగా ఈ నెలాఖరున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొత్త వార్త ఫిలిమ్ నగర్ వ

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (10:16 IST)
"అజ్ఞాతవాసి" సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ పాడిన పాట కొత్త సంవత్సరం కానుకగా ఈ నెలాఖరున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొత్త వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ''గోపాల గోపాల" సినిమాలో పవన్, వెంకటేశ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే.
 
ప్రస్తుతం ''అజ్ఞాతవాసి'' సినిమాలోను పవన్‌తో కలిసి వెంకటేశ్ కనిపిస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో వెంకీ నాలుగు నిమిషాల పాటు తెరపై కనిపిస్తారని సమాచారం. అంతేగాకుండా వెంకీ ఓ కామెడీ సీన్లో కనిపిస్తారని టాక్. అయితే ప్రస్తుతం వేరొక వార్త ప్రచారంలో వుంది. పవన్ మేనమామగా ఓ కామెడీ సీన్‌లో వెంకీ అలరిస్తారని అందరూ అనుకున్నారు. 
 
కానీ వెంకటేశ్ కనిపించేది కామెడీ సీన్లో కాదని.. యాక్షన్ సీన్లో అని సినీ జనం అంటున్నారు. పవన్‌తో పాటు వెంకటేష్ ఓ ఫైట్‌ సీన్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సీన్ సినిమాకు హైలైట్ అవుతుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments